కనీస వేతనాలకు ప్రధాన మంత్రే అడ్డం!

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెబుతుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం లోపలా, బయటా తనకు అవసరం అనిపించినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకుని మురిసిపోతుంటారు. ప్రజల ఓట్లతో అధికారం సంపాదించాక కనీసంగానైనా జనం గురించి పట్టించుకోకపోతారా అని సాధారణంగా మనమూ అనుకుంటాం. కానీ ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం చెల్లించడానికి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయమే సైంధవుడిలా అడ్డు పడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హై…