అరుణాచల్: మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య

గత ఏడెనిమిది నెలలుగా కాంగ్రెస్, బిజెపిల పదవీ రాజకీయాలకు కేంద్రంగా వార్తల్లో నిలిచిన అరుణాచల్ ప్రదేశ్, అనూహ్య సంఘటనను చవి చూసింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో తిరుగుబాటుకు నేతృత్వం వహించి, అనంతరం బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్, ముఖ్యమంత్రి నివాసంలో శవమై కనిపించాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తెలియజేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్ ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఆయన  తాడుతో మెడకు ఉరి వేసుకుని…

అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! 

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకోవటం ఇక లాంఛనప్రాయమే అనుకున్నారు అందరూ. చీలిక వల్ల ఆ పార్టీకి మెజారిటీ లేదు. కాస్త సమయం తీసుకుని చీలిన ఎమ్మెల్యేలను సొంత గూటికి రప్పిద్దాం అన్న లక్ష్యంతో బల నిరూపణకు సమయం కోరితేనేమో గవర్నర్ లేదు పొమ్మన్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో బలం నిరూపించుకోలేక ముఖ్యమంత్రి నబామ్ టుకి రాజీనామా సమర్పించటమే తరువాయి, అని అంతా భావించారు. “ఆపరేషన్ సక్సెస్,…

బి‌జే‌పి రోడ్ రోలర్ కింద డెమోక్రసీ -కార్టూన్

భారత ప్రజాస్వామ్యాన్ని రోడ్ రోలర్ తో తొక్కిపారేసినా చివరి క్షణంలో నైనా లేచి నిలబడుతుందని, తొక్కుడుదారులను ఎత్తి కుదేస్తుందని చెప్పటం బాగానే ఉంది గానీ, జరిగింది అదేనా అన్నదే అనుమానం! రోడ్డు రోలర్ బి‌జే‌పి చిహ్నం కమలాలను శ్వాసించటం సరైన పోలిక! రోడ్ రోలర్ లో ప్రధాన తొక్కుడు గాను/చక్రం ప్రధాన మంత్రి గానూ, డ్రైవర్ ను అమిత్ షా గానూ చెప్పటం ఇంకా సరైన పోలిక! రోడ్డు రోలర్ కలర్ విషయం వేరే చెప్పాలా?!  

కేంద్రం రెండో చెంపా వాయించిన సుప్రీం కోర్టు

ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు విషయంలో బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక చెంప వాయించిన సుప్రీం కోర్టు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మంత్రాంగం విషయంపై తీర్పు ద్వారా రెండో చెంప కూడా వాయించింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అమలు చేసిన విచక్షణాధికారాలను రద్దు చేసింది. జనవరి 14, 2016 తేదీన ప్రారంభం కావలసిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను “తన విచక్షణాధికారాలను వినియోగించి” డిసెంబర్ 16, 2015 తేదీకి మార్చుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని…

ఉత్తరాఖండ్: ఫ్లోర్ లేని చోట ఫ్లోర్ టెస్ట్! -కార్టూన్

“ఏ ఫ్లోర్ టెస్టూ?! వాళ్ళు అసలు ఫ్లోరే లేకుండా చేస్తిరాయే…!” ********* కాంగ్రెస్ ధరించిన అప్రజాస్వామిక కీర్తి కిరీటంలోని కలికితురాళ్లను బి‌జే‌పి ఒక్కొటొక్కటిగా దొంగిలిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే ప్రారంభమై ఇందిరా గాంధీ హయాంలో ఊపందుకున్న విచక్షణారహిత ‘ఆర్టికల్ 356 ప్రయోగం’ ప్రస్తుతం ప్రధాని మోడి నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించిన బి‌జే‌పి (కేంద్ర) ప్రభుత్వం పరిస్ధితులు…

ఇండియా చైనాల మధ్య 9 ఒప్పందాలు

చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ చైనాతో ఏకంగా 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాణిజ్య పరమైన ఒప్పందాలు మాత్రం ఏదీ కుదిరినట్లుగా పత్రికల్లో సమాచారం లేదు. అయితే తన చైనా పర్యటన గొప్పగా విజయవంతం అయినట్లు ప్రధాని ప్రకటించిచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారని, ఆయనను సంతోష పెట్టడానికి చైనా పెద్దలు వివిధ రకాలుగా ప్రయత్నించారని పత్రికలు రాశాయి. సరిహద్దు తగాదాల విషయంలో ఇరు దేశాలలో ఏదీ అవతలివారిపై మిలట్రీ…