ఇది రేప్ నెంబర్ 2 -అరుంధతి రాయ్

(తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతంపై ఔట్ లుక్ పత్రికకు అరుంధతి రాయ్ రాసిన ఆర్టికల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఇండియా ఇంక్ (India Ink) భాగస్వాముల్లో తరుణ్ తేజ్ పాల్ ఒకరు. నా నవల ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ను మొదట ప్రచురించిన పబ్లిషింగ్ కంపెనీ ఇదే. ఇటీవలి ఘటనలపైన స్పందించమని నన్ను అనేకమంది జర్నలిస్టులు కోరారు. మీడియా సర్కస్ పెద్ద పెట్టున ఊళపెడుతున్న నేపధ్యంలో  ఏదన్నా చెప్పడానికి…

సమస్య రాహుల్-మోడీ కాదు, టాటా-అంబానీలది -అరుంధతి

ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వ పోటీని రాహుల్ గాంధీ, నరేంద్ర మోడిల వరకే పరిమితం చేయడం సరైంది కాదని ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ అన్నారు. రాజకీయ పార్టీల కూటములు రాజ్యం ఏలుతున్న కాలంలో ప్రధాని ఎవరు అవుతారన్న విషయం ఇద్దరు పోటీదారుల కంటే విస్తృతంగా విస్తరించి ఉన్న అంశం అని ఆమె పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో నరేంద్ర మోడీయా లేక రాహుల్ గాంధీయా అన్న ఊబిలో పడవద్దని ప్రజలను హెచ్చరించారు. దేశాన్ని పాలిస్తున్నది కార్పొరేట్…

హింస కాదు ప్రతి హింస: అరుంధతీ రాయ్ -3

రెండో భాగం తరువాయి………….. సాగరికా ఘోష్: మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి మీరు ఇష్టపడతారా? ఎందుకంటే కబీర్ సుమన్ తో పాటు మీ పేరు కూడా వారు (మావోయిస్టులు) మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదించారు. అయితే మీరు తిరస్కరించారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు కదా? అరుంధతీ రాయ్: నేను నాకే భయపడుతున్నాను. అలాంటి నిపుణుతలు నాకు లేవు. నాపైన నాకు నమ్మకం లేదు. మీరు బాస్కెట్ బాల్ ఆటగాళ్లయితే మీరు ఈతగాళ్ళు…

అరుంధతీ రాయ్: హింస కాదు ప్రతి హింస -2

  మొదటిభాగం తరువాయి……………………. సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని…

ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)

అవును కదా? నా ఉద్దేశం నిన్నటి రోజు అని. వసంతం ఢిల్లీలో తనను తాను ప్రకటించుకుంది. సూర్యుడు ఉదయించాడు, చట్టం తన పని తాను చేసుకుని పోయింది. బ్రేక్ ఫాస్ట్ కి కొద్దిసేపటి ముందు, 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు రహస్యంగా ఉరితీయబడ్డాడు. అతని విగత దేహాన్ని తీహార్ జైలులోనే పూడ్చిపెట్టారు. మక్బూల్ భట్ కి పక్కనే ఆయనను పూడ్చిపెట్టారా? (1984లో ఉరి తీయబడిన మరో కాశ్మీరీ ఆయన. ఆయన…

ఇరాక్‌లో లక్షన్నర అమెరికా సైన్యం, కాశ్మీర్ లో ఏడు లక్షల ఇండియా సైన్యం -అరుంధతి రాయ్

అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలు ఇరాక్ లో లక్షన్నర వరకూ ఉండగా, చిన్నపాటి కాశ్మీరు లోయలో మాత్రం భారత సైన్యాలు ఏడు లక్షలకు పైగా మొహరించాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని ఆసియా సొసైటీ వారు నిర్వహించిన ఒక కాన్ఫరెన్సులో కాశ్మీరు విషయమై మాట్లాడుతూ ఆమే ఈ వ్యాఖ్యలు చేశారు. “కాశ్మీర్: ద కేస్ ఫర్ ఫ్రీడం” అన్న అంశంపై ఈ కాన్ఫరెన్సు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన ఆక్రమణలలో కాశ్మీరు ఒకటని…