ప్రభుత్వమే ఖర్చు పెంచాలి -ఆర్ధిక సలహాదారు
మోడి ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ప్రైవేటు పెట్టుబడులు ఎంతకీ ముందుకు రావడం లేదు. ‘మేక్-ఇన్-ఇండియా’ నినాదం కాస్తా హుళక్కి అయిపోయింది. బి.జె.పి/మోడి రాక వల్లనే మొదటి త్రైమాసికంలో జి.డి.పి 5.7 శాతం వృద్ధి చెందిందని తమ జబ్బలు తామే చరుచుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మెల్లిగా ‘అబ్బే, ప్రభుత్వమే ఖర్చు పెంచక తప్పదు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ అంటూ ప్రభుత్వ ఖర్చును తగ్గించి తద్వారా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలని ప్రబోధించిన…