ఢిల్లీ ఎన్నికలు: ఫోటోలు, కార్టూన్లు, ఫిర్యాదులు…

ఢిల్లీ ఎన్నికలు వేడెక్కాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సహ ఉద్యమకారిణి కిరణ్ బేడీని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బి.జె.పి ప్రకటించింది. ఈ దెబ్బతో ఏఏపి నేత కేజ్రీవాల్ దూకుడుకు పగ్గం వేయవచ్చని బి.జె.పి భావించి ఉండవచ్చు. కానీ వాస్తవంలో కిరణ్ బేడి అభ్యర్ధిత్వం సానుకూలం కావడం అటుంచి ప్రతికూలం అవుతున్నట్లుగా పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బి.జె.పి అతిరధ మహారధులందరూ రంగంలోకి దిగి చెమటోడ్చుతున్నారు. ఎన్నికల పోటీ పోటాపోటీగా జరుగుతుందని పార్టీలు భావిస్తుండడంతో ప్రచారంలో…

ఎఎపి నాడు, నేడు -కార్టూన్

ఢిల్లీ ఎన్నికలు ఖాయం అయ్యాయి. మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బి.జె.పి సుముఖంగా లేకపోవడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేశారు. అది కూడా సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేశాకనే సాధ్యపడిందన్నది వేరే సంగతి. జంగ్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి. కానీ ఎఎపి పరిస్ధితి అప్పటిలాగా లేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి…

కేజ్రీవాల్ చీపురు మోడి చేతికి! -కార్టూన్

కాంగ్రెస్ పాలనలో భారత దేశం సర్వ రంగాలలోనూ భ్రష్టు పట్టిపోయిందని బి.జె.పి తరచుగా చేసే ఆరోపణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఎంతో ఇష్టమైన విమర్శ. తాము అధికారంలోకి వచ్చాము గనక ఇక నిశ్చింతగా నిద్రపోండి, మిగిలింది మేము చూసుకుంటాం అని వీరు చెప్పబోతారు. ఆలి పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా అన్నట్లు దేశాన్ని ఐదేళ్ల పాటు, రాష్ట్రాన్ని 9 సం.ల పాటు ఏలిన నేతల సంగతి జనానికి తెలియకనా,…

అరవింద్: అసంతృప్త నేతల పంచింగ్ బ్యాగ్

“మిత్రులారా, ఈ ప్రభుత్వం తప్పులు చేసేవరకూనో లేదా కొత్త పంచింగ్ బ్యాగ్ దొరికేవరకూనో -ఈ రెండిట్లో ఏది ముందోస్తే అంతవరకూ కాస్త ఓపిక పట్టండి…” *** *** *** ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి వివిధ ప్రాంతాల్లోని ఎఎపి నాయకులు వరుస కట్టి రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేసేస్తే మరికొందరు పార్టీ సభ్యత్వాన్ని అట్టే పెట్టుకుని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. బహుశా వీళ్ళంతా పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ…

ఎఎపి పరిస్ధితి ఇక ఇదేనా? -కార్టూన్

సామాన్యుడిని నెత్తి మీద పెట్టుకుంటానని ఉనికిలోకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. కానీ అనతికాలం లోనే జనంలో పలుకుబడి కోల్పోయిందని లోక్ సభ ఎన్నికలు రుజువు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని కట్టబెట్టడం ద్వారా  ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తగిన విధంగా ఆచరణలోకి తేవడంలో ఆ పార్టీ విఫలమైందని అందుకే ప్రజల్లో పలచన అయిందని వారి అవగాహన. అధికారంలోకి వచ్చీ రావడంతోనే సంచలన కార్యక్రమాలకు తెరతీసిందని సో కాల్డ్ మర్యాదస్తులు,…

ట్విట్టర్ లో విజేతలు మోడి, ఎఎపి -ది హిందు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఇంటర్నెట్ లోని ఐ.టి కంపెనీలు భారత సాధారణ ఎన్నికల్లో ఒక ముఖ్య పాత్ర పోషించాయి. బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి ఇంటర్నెట్ ను కూడా ఇమేజ్ బిల్డప్ కోసం ప్రతిభావంతంగా వినియోగించు కోవడం మొదలు పెట్టిన ఈ ధోరణిని ఇతర పార్టీల నేతలు కూడా అనుసరించడంతో ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు ఎన్నికల పోరాటానికి వర్చువల్ వేదికలుగా…

ఎఎపి: నోట్లు ఊడ్చినట్లే ఎన్నికలూ ఊడ్చాల! -కార్టూన్

“ఎన్నికలను కూడా ఇలాగే ఊడ్చేయగలిగితే బాగుడ్ను!” – ఎన్నికలలో ఖర్చు కోసం పరిశుభ్రమైన డబ్బు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ ద్వారా పిలుపు ఇవ్వడంతోనే రెండు రోజుల్లో 1.15 కోట్ల రూపాయలు వసూలయ్యాయట. అత్యంత పెద్ద మొత్తం తమిళనాడు నుండి అందిన రు. 1 లక్ష కాగా, అత్యంత చిన్న మొత్తం రు. 10 అని ఎఎపి నేతలు చెప్పారు. అరవింద్ ట్విట్టర్ లో చేసిన విన్నపం ఇది: “Reached Varanasi. Will go to…

చెంప దెబ్బ: నేనే ఎందుకు? -కార్టూన్

ఈ కార్టూన్ కి ఇక వివరణ అనవసరం. ప్రజలకు అందనంత దూరంలో ఎగిరిపోతూ, అందనంత ఎత్తులో స్టేజీ ఉపన్యాసాలు దంచుతూ, ఎస్.పి.జి, జెడ్ ప్లస్ లాంటి రక్షణ వలయాల వెనుక దాక్కుంటూ ప్రచారం చేసే నేతలు తమ ఆగ్రహం వెళ్లగక్కడానికి జనానికి ఎలాగూ అందుబాటులో ఉండరు. కాబట్టి అందినవారిపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఓ సినిమాలో (పెద్ద మనుషులు అనుకుంటాను) కమెడియన్ గా నటించిన సుధాకర్ తరుముకు వస్తున్న విలన్ నుండి తప్పించుకోవడానికి దాక్కోవడానికి ప్రయత్నిస్తూ, తగిన…

ఆటోవాలా చెంపదెబ్బ, కేజ్రీవాల్ గాంధీ దెబ్బ

ఢిల్లీలో ప్రచారం చేస్తుండగా మంగళవారం (ఏప్రిల్ 8) ఒక ఆటోవాలా చేతిలో చెంపదెబ్బ తిన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సదరు ఆటోవాలాకు తనదైన స్పందనను రుచి చూపించాడు. తన చెంప ఛెళ్ళుమానిపించిన ఆటో వాలా ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన ఎందుకు అలా చేయవలసి వచ్చింది కనుక్కునేందుకు ప్రయత్నించాడు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించనందునే తాను అలా చేయవలసి వచ్చిందని సదరు వ్యక్తి చెప్పడంతో ఆయనను క్షమించినట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పురి…

మోడీజీ, అది ఎ.కె-49 కాదు చీపురు! -కార్టూన్

బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పదవికి పోటీ పడుతున్న వ్యక్తికి ఉండాల్సిన స్ధాయికి తగిన విధంగా లేవని ఎప్పటినుండో వినిపిస్తున్న విమర్శ. ఆ విమర్శకు తగినట్లుగానే నరేంద్ర మోడి నిన్న (మార్చి 26) మరో చవకబారు విమర్శను ఎక్కుపెట్టారు. జమ్ము & కాశ్మీర్ లో ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన మోడి దేశంలో మూడు ఏ.కె లు పాకిస్తాన్ కి సహాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.…

యు.పి స్టింగ్: ఎఎపి టికెట్ కి డబ్బు డిమాండ్

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్ధులనుండి ఆ పార్టీ నాయకులు డబ్బు డిమాండ్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఒక టి.వి ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ సంగతి వెల్లడి అయిన వెంటనే సదరు నాయకులను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూ ఢిల్లీ, తిలక్ లేన్ లో ఉన్న తన నివాసం వద్ద విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎ.కె…

జనం భారీగా వస్తేనే అన్నా వస్తారు -కార్టూన్

అవును. జనం పెద్ద సంఖ్యలో వస్తేనే అన్నా హజారే సభలకు వస్తారట. లేకపోతే రారట. ఈ సంగతి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభ ద్వారా తెలిసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అన్నా హజారేలు ఇరువురూ హాజరు కావలసిన సభకు అన్నా రాలేదు. కారణం ఏమిటా అని చూస్తే సభకు పెద్దగా జనం రాకపోవడం వల్లనే అన్నా రాలేదని ఆయన ప్రతినిధులు వివరించారని పత్రికలు తెలిపాయి. మార్చి 12 తేదీన ఢిల్లీలో ఒక ఎన్నికల…

అన్నా హజారే రాజకీయం -కార్టూన్

“అవినీతి వ్యతిరేక పోరాటాన్ని నేను తేలిక చేసేశాను – మన దీదీని ఎన్నుకోండి చాలు – ఇక అవసరమైందంతా ఆమె పూర్తి చేసేస్తారు…” *** రాజకీయాలు తనకు సరిపడవని చెబుతూ అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు. మొదట అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పి కూడా కిరణ్ బేడీ మంత్రాంగంతో ఆయన వెనక్కి తగ్గారు. పైగా ఎన్నికల్లో తన పేరు వినియోగించడానికి వీలు లేదంటూ ఆప్ పార్టీపై ఆంక్షలు…

జన్ లోక్ పాల్ ఓటమి, రాజీనామా దిశగా అరవింద్

దేశ రాజకీయ చిత్రపటంపై తమను తాము ఉప్పు-నిప్పుగా చెప్పుకునే కాంగ్రెస్, బి.జె.పి లు ఒక తాటి మీదికి రావడంతో ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశ దశలోనే ఓటమిని ఎదుర్కొంది. దానితో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసే దిశలో ప్రయాణిస్తోంది. ముఖేష్ అంబానీపై రాష్ట్ర ఎ.సి.బి చేత అవినీతి కేసు నమోదు చేయించినందుకే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటయ్యాయని అరవింద్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఎంత దూరం అయినా…

కేజ్రీవాల్ పని: ఆజియన్ స్టేబుల్స్ శుభ్రపరచడం -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్ పని తీరు (వర్కింగ్ స్టైల్) పైన సున్నితమైన విమర్శ ఈ కార్టూన్. CLEANING OF AUGEAN STABLES అనే ఆంగ్ల వాడుకను కార్టూనిస్టు ఇందులో వినియోగించారు. ఆజియన్ అనే ఆయన గ్రీకు పురాణాల్లో ఒక రాజు. ఆయన వద్ద స్వర్గం నుండి ప్రసాదించబడిన పశు సంపద భారీగా ఉండేదిట. భారీ సంఖ్యలో ఉన్నందున వాటి విసర్జనాలు కూడా పెద్ద మొత్తంలో ఉండేవి. అందువలన ఆయనగారి పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం ఎవరికైనా అసాధ్యం. హెర్క్యూలియస్ అనే…