ఢిల్లీ ఎ.సి.బి అదుపుకు కేంద్రం ప్రయత్నాలు!

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వంలో, ఎ.ఎ.పి-1 పాలనలో, భారత దేశంలో అత్యధిక ధనికుడైన ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎ.సి.బి అవినీతి కేసు నమోదు చేసింది. అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, ఇంకా ఇతర అధికారులపై కూడా అప్పటి ప్రభుత్వం అవినీతి కేసు నమోదు చేసింది. పలువురు ప్రముఖులు చేసిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎ.ఎ.పి ప్రభుత్వం ముఖేష్ అంబానీ, వీరప్ప మొయిలీ, మురళి దియోరా, వి.కె.సిబాల్ లపై నమోదు చేసిన కేసు వివరాల కోసం కింది…