బి.జె.పి ని కూడా టార్గెట్ చేద్దాం: కేజ్రీవాల్, వద్దు: కిరణ్ బేడీ

బొగ్గు కుంభకోణం కి సంబంధించి  బి.జె.పి ని టార్గెట్ చేసే విషయంలో మాజీ అన్నా బృందం కీలక సభ్యులయిన అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ల మధ్య విభేధాలు పొడసూపాయి. బొగ్గు గనులను ప్రవేటు కంపెనీలకు విచ్చలవిడిగా కట్టబెట్టడంలో కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ దోషులేనని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తుండగా, పాలక పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన దోషి అని కనుక దానినే టార్గెట్ చెయ్యాలనీ కిరణ్ బేడీ భావిస్తోంది. లోక్ పాల్ విషయంలో పూర్తిగా కాకపోయినా…

సి.బి.ఐని ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయించడం ఆర్.టి.ఐ చట్టానికే విరుద్ధం

సమాచార హక్కు చట్టం నుండి సి.బి.ఐ (Central Bureau of Investigation) సంస్ధను మినహాయించడం సమాచార హక్కు చట్టానికే విరుద్ధం అని ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ తెలిపాడు. అరవింద్ కేజ్రీవాల్ లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలో పౌరసమాజ ప్రతినిధిగా నియమించబడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సి.బి.ఐని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నదనీ, ఆ సంస్ధ ద్వారా రాజకీయ ప్రత్యర్ధులను సాధించడానికే దానిని ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయించడానికి నిర్ణయించిందని అరవింద్…