ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

మరో లిబియా కానున్న సిరియా, అమెరికాకు అరబ్ లీగ్ సహకారం -కార్టూన్

లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వ కూల్చివేతకు అమెరికా, యూరప్ లతో సహకరించిన అరబ్ లీగ్, ఇప్పుడు సిగ్గు విడిచి సిరియాను కూడా పశ్చిమ దేశాల విష పరిష్వంగంలోకి నెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. లిబియా గగనతలాన్ని ‘నిషిద్ధ గగనతలం’ గా ప్రకటించి అమలు చేయడంలోనూ, ఆదేశంపై పశ్చిమ దేశాలు ఏడు నెలలపాటు బాంబు దాడులు చేసి సర్వనాశనం చేయడంలోనూ అరబ్ లీగ్ కూటమి అమెరికా, యూరప్ లకు పూర్తిగా సహకరించింది. పశ్చిమ దేశాల ఎంగిలి మెతుకులకు రుచిమరిగిన అరబ్ లీగ్,…

మీరు లిబియన్లపై బాంబులేసుకొండి, మేం మా ప్రజల్ని చంపుకుంటాం -అమెరికా, సౌదీఅరేబియాల అనైతిక ఒప్పందం

ఒకరి దారుణాలను మరొకరు ఖండించుకోకుండా అమెరికా, సౌదీ అరేబియాల మధ్య అనైతిక ఒప్పందం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ నిజం అరబ్ ప్రపంచానికి చెందిన వార్తా సంస్ధలకు ఎప్పుడో ఉప్పందింది. అరబ్, ముస్లిం ప్రపంచంలోని ప్రముఖ బ్లాగర్లు బైట పెట్టే వరకూ ఈ దారుణం ప్రపంచానికి తెలియలేదు. లిబియా పౌరులను గడ్డాఫీ సైన్యాలు చంపుతున్నాయంటూ కాకి గోల చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు బహ్రెయిన్, యెమెన్ ల ప్రభుత్వాధిపతులు అక్కడ…

బహ్రెయిన్ చీకటి రహస్యం -వీడియో

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజలు ఉద్యమించి నియంతృత్వ పాలకులను పదవీచ్యుతులను చేశాక ఆ దేశాల స్ఫూర్తితో ప్రజాందోళనలు మొదలైన అరబ్ దేశాల్లో బహ్రెయిన్ కూడా ఒకటి. బహ్రెయిన్ రాజు వెంటనే గద్దె దిగాలని బహ్రెయిన్ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నారు. మొదట మళ్లీ పోటీ చేయననీ, 2013 లో తన పదవీ కాలం ముగిశాక ఇతరులకు అధికారం అప్పగిస్తామని హామీ ఇచ్చినా ప్రజలు అంగీకరించలేదు. ప్రజలకు అనేక తాయిలాలు ప్రకటించీన లొంగలేదు.…

లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి…

పశ్చిమ దేశాల దాడులకు ఊతమిచ్చిన గడ్డాఫీ చర్యలు

ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లకు ఇప్పుడు మరో దేశం జత కలిసింది. అమెరికాతో పాటు ఐరోపాలలోని పెత్తందారీ దేశాలు మరో బాధిత దేశాన్ని తమ ఖాతాలో చేర్చుకున్నాయి. శనివారం లిబియాపై ఫ్రాన్సు జరిపిన విమానదాడులతో ప్రారంభమైన పశ్చిమ దేశాల కండకావరం ఆదివారం అమెరికా, బ్రిటన్ ల క్షిపణి దాడులతో మరింత పదునెక్కింది. ప్రత్యక్షంగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాల్ దేశాల ప్రజలు కష్టాల సుడిగుండం లోకి నెట్టడంతో పాటు పరోక్షంగా తమ దేశాల ప్రజలను కూడా ఆర్ధిక, సామాజిక సంక్షోభం లోకి…

గడ్డాఫీ స్వాధీనంలో రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’

గడ్డాఫీ బలగాలు రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం మొదటి ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ను వశం చేసుకున్న గడ్డాఫీ బలగాలు సాయంత్రానికి ‘బ్రెగా’ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు బలగాలు తమ కేంద్ర పట్టణమయిన ‘బెంఘాజీ’ కి ముఖద్వారమైన ‘అజ్దాబియా’ పట్టణానికి తిరుగుటపా కట్టారు. అజ్దాబియా కూడా గడ్డాఫీ స్వాధీనం చేసుకున్నట్లయితే తిరుగుబాటుదారుల వశంలో ఉన్న తూర్పు ప్రాంతంపై కూడా గడ్డాఫీ బలగాలు దాడి చేయవచ్చు. సాయుధ గ్యాంగులను…

లిబియా నిషిద్ధ గగనతలానికి అరబ్ లీగ్ ఆమోదం, గడ్డాఫీ బలగాల పురోగమనం

లిబియా అంతర్యుద్ధంలో గడ్డాఫీ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను తూర్పువైపుకి నెట్టుకుంటూ వెళ్తున్న నేపధ్యంలో కైరోలో శనివారం సమావేశమైన అరబ్ లీగ్ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” అమలుకు ఆమోదముద్ర వేశాయి. సిరియా, అల్జీరియా మినహా అన్ని దేశాలూ “నో-ఫ్లై జోన్” ప్రతిపాదనను ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిని లిబియాపైన “నో-ఫ్లై జోన్” అమలు చేయాల్సిందిగా కోరుతూ అరబ్ లీగ్ తీర్మానించింది. లిబియాలో ప్రస్తుత సంక్షోభం ముగిసే వరకూ నో-ఫ్లై జోన్ అమలు చేయాలని తీర్మానంలో…

తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు

లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా…