తాజా వార్త: దేశం విడిచి వెళ్ళిన యెమెన్ అధ్యక్షుడు సలే
శుక్రవారం నాటి రాకెట్ దాడిలో గాయపడిన యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే మెరుగైన వైద్యం కోసం సౌదీ అరేబియాకు వెళ్ళినట్లుగా బిబిసి ప్రకటించింది. అధ్యక్షుడు సలేతో పాటు అతని కొలువులోని ప్రధాని తదితర ముఖ్య అధికారులంతా దేశం విడిచి వెళ్ళినట్లు తెలిపింది. అయితే ఆయన వైద్యం కోసమే వెళ్ళాడా లేక ప్రజల డిమాండ్ ను నెరవేర్చాడా అన్నది వెంటనే తెలియరాలేదు. శుక్రవారం గాయపడ్డాక అధ్యక్షుడు సలే మళ్ళీ ప్రజలకు టీవిలో కనిపించలేదు. ప్రభుత్వ టెలివిజన్ ఆడియో…