యూరప్ దేశాల్లో రేడియేషన్ ఆనవాళ్లు, ఫుకుషిమా కారణం కాదన్న ఐ.ఎ.ఇ.ఎ

యూరప్ లో అనేక చోట్ల వాతావరణంలో రేడియో ధార్మికత కనుగొన్నట్లుగా ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐ.ఎ.ఇ.ఎ) సంస్ధ శుక్రవారం వెల్లడించింది. 11.11.11 తేదీన ప్రపంచ ప్రజలందరికీ శుభం జరుగుతుందని కాలజ్ఞానులు చెబుతున్న నేపధ్యంలో ఈ వార్త వెలువడడం గమనార్హం. రేడియో యాక్టివ్ అయోడిన్ – 131 మూలకానికి సంబంధించిన రేడియేషన్ తక్కువ స్ధాయిలో చెక్ రిపబ్లిక్ వాతావరణంలో కనిపించిందని ఐ.ఎ.ఇ.ఎ తెలిపింది. చెక్ రిపబ్లిక్కే కాక యూరప్ లోనే అనేక దేశాల్లో ఈ రేడియేషన్ కనిపించిందని…