తాలిబాన్ చేతిలో మరో నలుగురు అమెరికా సైనికులు హతం

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో తాలిబాన్ మిలిటెంట్ల బాంబు దాడిలో బుధవారం మరో నలుగురు అమెరికా సైనికులు చనిపోయినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. సాపేక్షికంగా తాలిబాన్ కి బలం లేదని భావించే ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్ లోని ఫార్యబ్ రాష్ట్రంలో ఈ దాడి చోటు చేసుకుంది. నాటోకి చెందిన ఐ.ఎస్.ఏ.ఎఫ్ (ఇంటర్నేషనల్ సెక్యూరిటి ఆసిస్టెన్స్ ఫోర్స్) మాత్రం ఇద్దరు సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అయితే ఫార్యబ్ బాంబు దాడుల్లో మరణించినవారు తమ లెక్కలో లేరని ఐ.ఎస్.ఏ.ఎఫ్ తెలిపింది. ఈ లెక్కన…

తాలిబాన్ రాకెట్ దాడిలో 38 మంది అమెరికా సైనికుల హతం

ఆఫ్ఘనిస్ధాన్ లోని సెంట్రల్ మైదాన్ వార్డాక్ రాష్ట్రంలోని సైదాబాద్ లో తాలిబాన్ ఫైటర్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్.పి.జి) తో 38 మంది సైనికులున్న ఛినూక్ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లుగా తాలిబాన్ ప్రకటించింది. అయితే ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాత్రం ఛినూక్ హెలికాప్టర్ కూలిపోయిందనీ, కూలిపోయిన ఘటనలో చనిపోయిన వారిలో 31 మంది అమెరికా సైనికులు కాగా 7గురు ఆఫ్ఘన్ కమేండర్లనీ తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం మొదలయ్యాక ఒకే సంఘటనలో…