బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే

బోస్టన్ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా అమెరికా ప్రకటించిన చెచెన్యా జాతీయులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబులు అభివృద్ధి చేసి సి.సి కెమెరాలు చూస్తుండగా వాటిని సంచుల్లో పెట్టుకుని బోస్టన్ మారధాన్ స్ధలానికి తెచ్చి ఎలా పేల్చగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలిద్దరిని కుట్ర చేసి ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు రష్యా టుడే తెలియజేసింది. ఎఫ్.బి.ఐ గూఢచారులు ఎప్పుడూ తమ ఇంటికి వచ్చేవారని, తమ పిల్లల గురించి…

హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ

అమెరికాలో న్యూయార్క్ సబ్ వే లో భారతీయుడొకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైలుకోసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ అమెరికన్ మహిళ స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న రైలు ముందుకి వెనకనుండి తోసి చంపేసింది. మొదటి, రెండు కంపార్ట్ మెంట్లు అతని మీదుగా పోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని సునందో సేన్ గా గుర్తించారు. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ అమెరికన్ మహిళ అంగీకరించినట్లుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11, 2001…

మధ్యప్రాచ్యం: టర్కీకి అమెరికన్ పేట్రియాట్, సిరియాకి రష్యన్ ఇస్కందర్

మధ్యప్రాచ్యం (Middle-East) లో ఉద్రిక్తతలు ప్రమాదకరమైన స్ధితికి చేరుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని రెచ్చగొడుతూ ముస్లిం టెర్రరిస్టులను ప్రవేశపెడుతున్న టర్కీకి అమెరికా పేట్రియాట్ క్షిపణులను సరఫరా చేసినందుకుగాను రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న క్షిపణి రక్షణ వ్యవస్ధ (Missile Defence System) కి కూడా దొరకని అత్యంత అధునాతనమైన ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకి సఫరా చేసింది. టర్కీ కోరికపై పేట్రియాట్ క్షిపణులను అమెరికా సరఫరా చేశాక ‘అతి చేయవద్దంటూ’ టర్కీని రష్యా హెచ్చరించిన మరుసటి…

శిఖండి టర్కీ అండగా, సిరియా దురాక్రమణలో అమెరికా మరో అడుగు

సిరియాపై అమెరికా ప్రత్యక్ష దురాక్రమణ దాడి మొదలయినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల అండతో 18 నెలలుగా సిరియా ప్రజలపై టెర్రరిస్టులు సాగిస్తున్న మారణకాండ అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యక్ష జోక్యానికి సాకులు వెతుకుతున్న నాటో కూటమి తానే ఒక సాకును సృష్టించుకుంది. టర్కీ భూభాగం నుండి సిరియాలోకి చొరబడిన టెర్రరిస్టులు టర్కీ పైకే జరిపిన దాడిని అడ్డు పెట్టుకుని సిరియాపై ఆయుధ దాడికి టర్కీ (నాటో సభ్యురాలు) మిలట్రీ తెగబడింది. ఇరాక్ పై…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…

గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోవద్దు -అమెరికాని కోరిన భారత ప్రభుత్వం

ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతున్న నిత్య మారణహోమం భారత పాలకులకు దీపావళి లాగా కనిపిస్తున్నట్లుంది. కాకుంటే ఎక్కడినుండో ఏడేడు సముద్రాల ఆవలినుండి వచ్చిన అమెరికా, దాని తైనాతీ దేశాలు పొరుగు దేశాన్ని ఆక్రమించి బాంబుదాడులతో, సైనిక కాల్పుల్లో ఆఫ్ఘన్ ప్రజల ఉసురు తీస్తుంటే దాన్ని ఖండించి ఆఫ్ఘన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించే బదులు దురాక్రమణ సైన్యాన్ని మరికొంత కాలం కొనసాగించాలని బ్రతిమాలుతుందా? బ్రిటిష్ వలసవాదులు, భారత ప్రజల పోరాటాలకు తలొగ్గి 1947లో దేశం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించినప్పుడు ఏ చైనా,…