ఇరాక్: అమెరికా అంటించిన రావణ కాష్టం

అమెరికా, ఐరోపాలు నెలకొల్పిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇరాక్ లో మూడు పేలుళ్లు, అరవై చావులుగా వర్ధిల్లుతోంది. పశ్చిమ దేశాల నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్… ఇత్యాది దేశాల సైనిక మూకలు మోసుకొచ్చిన ఆధునిక విలువలు ఇరాక్ ను ఆధునిక నరకంగా మార్చివేశాయి. 8 యేళ్ళ పాటు తిష్ట వేసిన నాటో కూటమి సైన్యాలు నాటిన సెక్టేరియన్ విద్వేషాలు ఇప్పుడక్కడ ఆత్మాహుతి దాడులుగా, బాంబు పేలుళ్లుగా, వేలాది హత్యలుగా పుష్పించి విరాజిల్లుతున్నాయి. 2008 తర్వాత అత్యంత…

ఆఫ్ఘనిస్తాన్: అమెరికాను కాదని ఇరాన్ తో స్నేహ ఒప్పందం

‘లోయ జిర్గా’ ఆమోదించిన తర్వాత కూడా అమెరికాతో ‘భద్రతా ఒప్పందం’ పై సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇరాన్ కు వెళ్ళి మరీ స్నేహ-సహకార ఒప్పందంపై సంతకం చేసేశారు. ఆఫ్ఘన్ ప్రజలకు భద్రత ఇవ్వడంపై హామీ ఇవ్వకుండా, 2014 తర్వాత కూడా అమెరికా, నాటో సేనలు ఆఫ్ఘన్ లో కొనసాగింపజేసే ఒప్పందంపై సంతకం చేసేది లేదని కర్జాయ్ రెండు వారాల క్రితం తిరస్కరించారు. కానీ ‘ప్రాంతీయ భద్రత’ కోసం ఇరాన్ తో…

ప్రశ్న: ప్రపంచీకరణ అంటే…?

కె.బ్రహ్మం: ప్రపంచీకరణ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: రెండో అంశాన్ని వివరిస్తూ మొదటి అంశానికి వస్తాను. ప్రపంచీకరణ (Globalization) కు నిర్దిష్ట నిర్వచనం ఒక వాక్యంలో చెప్పడం తగదు. ప్రపంచీకరణ అనేది మానవ సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో ఏర్పడిన ఒక అనివార్య దశ. ఈ దశకు మూలాలు క్రీస్తు పూర్వం మూడో మిలీనియంలోనే ఉన్నాయని చెప్పేవారు లేకపోలేదు. అంత వెనక్కు కాకపోయినా 15వ శతాబ్దంలో…

అమెరికా డ్రోన్ దాడుల్లో వందల పౌరులు బలి -ఐరాస

టెర్రరిస్టుల పేరు చెప్పి అమెరికా సాగిస్తున్న చట్ట విరుద్ధ డ్రోన్ దాడుల్లో వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక నివేదిక పేర్కొంది. అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు అమాయక పౌరులు డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఐరాస నిర్వహిస్తున్న దర్యాప్తుకు కూడా అమెరికా సహకరించడం లేదని ఐరాస ప్రత్యేక ప్రతినిధి (special rapporteur) బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…

అణు పరిహార చట్టం: గదిలో ఏనుగు! -కార్టూన్

“Elephant in the room” అనేది ఆంగ్లంలో ఒక సామెత. ‘చర్చించడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టం లేని సమస్య, కానీ విస్మరించలేని సమస్య’ ను సూచించడానికి ఈ ‘గదిలో ఏనుగు’ సామెతను వాడతారు. భారత అణు పరిహార చట్టం విదేశీ కంపెనీలకు ఈ సామెతను గుర్తుకు తెస్తోంది(ట)! గదిలో ఏనుగు ఉన్నపుడు, భారీ ఆకారంతో ఉంటుంది గనక ఆ గదిలో ఉన్నవారికి ఒక సమస్యగా ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకోడానికి వారికి మార్గం లేని పరిస్ధితి వారికి ఉంటుంది.…

సిరియా: కాంగ్రెస్ లో నేను ఓడిపోవచ్చు -ఒబామా

సిరియాపై దాడి చేయడానికి కాంగ్రెస్, సెనేట్ ల అనుమతి కోరిన బారక్ ఒబామా, ఓటింగులో తాను ఓడిపోవచ్చని అంగీకరించాడని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. సోమవారం ఎన్.బి.సి చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఒబామా ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఐతే ఓటింగులో ఓడిపోతే ఏమి చేసేదీ చెప్పడానికి ఒబామా నిరాకరించారు. ఆ విషయమై తానింకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. సిరియాపై దాడికి అమెరికా ఉభయ సభలను, ప్రజలను ఒప్పించడానికి తంటాలు పడుతున్న ఒబామా…

అమెరికా రసాయన దుష్ట చరిత్ర -2

(ఇది కూడా రామ్మోహన్ గారు రాసినదే.) విలియం బ్లం చెప్పింది నేను పాక్షికంగానే రాశాను. ఇరాక్ లో 1985 నుండి 1989 దాకా వివిధ రకాల విషపదార్ధాలను ఆయుదాల తయారీకి కోసం ఇరాక్ కు ఎగుమతి చేశారు. బాసిలస్ ఆంత్రాక్స్ – ఆంత్రాక్స్ కోసం క్లొస్ట్రిడియం బొటులినం -ఒక విషపదార్ధం. హిస్ట్రొప్లస్మా కాప్స్లేటం- శ్వాశకొశం, మెదడు, వెన్నెముక, హృద్రోగాలు కలిగించే విషం ఇది. బ్రుసెలా మెలిటిన్సి-అంగవికలురను చేసేపదార్ధం. క్లొస్ట్రియం పెర్విజెన్స్- దీర్ఘకాలిక జబ్బులను కలిగించటానికి. క్లొస్ట్రిడియం టిటాని-…

అమెరికా రసాయన దుష్ట చరిత్ర, క్లుప్తంగా….

(ఇది రామ్మోహన్ గారి వ్యాఖ్య. కొంచెమే అయినా విలువైన సమాచారం!) అమెరికా జీవ రసాయన ఆ యుదాలను 1940 నుండి వాడుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ సంయుక్తంగా కరేబియన్ సముద్రంలొబాక్టీరియా స్ప్రే చేశాయి. లక్షలాది జలచరాశులు మరణించాయి. కొరియా మీదా వెదజల్లింది. దీనివల్ల లక్షలాది మంది ప్లేగు, ఆంత్రాక్స్, మెదడు వాపు వ్యాధి వగైరా రోగాలు ప్రబలి జనం మరణించారు. 1967-69లో ఏజెంట్ ఆరెంజ్ ను 23,607 ఎకరాల కొరియా పంట పొలాల మీద స్ప్రే చేసింది…

సిరియా: 2 రోజులు కాదు, ఉధృత దాడికే సెనేట్ కమిటీ ఆమోదం

శాంతి కపోతం ఇప్పుడు ఇనప రెక్కల్ని తొడిగిన డేగగా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతిని బారక్ ఒబామాకు ఇచ్చినందుకు నోబెల్ కమిటీ సిగ్గుపడుతున్నదో లేదో గానీ సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మాత్రం ఖచ్చితంగా మరోసారి చనిపోయి ఉంటాడు. మొదట రెండు రోజుల పరిమిత దాడి అని చెప్పిన ఒబామా ఆ తర్వాత సెనేట్ కమిటీలో చర్చకు పెట్టకుముందే

రసాయన దాడి మా పనే -సిరియా తిరుగుబాటుదారులు

నిజానికి ఇది సంచలనవార్త! ఆగస్టు 21 తేదీన సిరియాలో రసాయన ఆయుధాలతో జరిగిన దాడికి సిరియా ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, అధ్యక్షుడు బషర్ అస్సాద్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఒక పక్క చెవి కోసిన మేకల్లా అరుస్తూనే ఉన్నారు. మరో పక్క సదరు రసాయన దాడికి తామే బాధ్యులమని సిరియా తిరుగుబాటుదారులు అంగీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి ఒకరు తిరుగుబాటులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా…

బారక్ ఒబామా సర్కస్ ఫీట్లు -కార్టూన్

దాడి పరిమితంగా ఉండేందుకే ఇదంతా… – అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ సిరియాపై దాడి చేయడానికే అమెరికా కట్టుబడి ఉన్నదని ఆ దేశ రక్షణ కార్యదర్శి చక్ హేగెల్ మరోసారి ప్రకటించాడు. ప్రపంచ పోలీసు పెత్తనం చెలాయించడంలో అమెరికా లాఠీని మోసే అనుంగు మిత్రుడు బ్రిటన్ లో సిరియా పై దాడి చేసే ప్రయత్నాలను పార్లమెంటు తిరస్కరించినా వెనకడుగు వేసేది లేదని చక్ ప్రకటించాడు. అమెరికా జాతీయ భద్రతకు కట్టుబడి ఉండడానికే ఒబామాను ప్రజలు ఎన్నుకున్నారని కాబట్టి…

పశ్చిమ యుద్ధోన్మాదులకు లొంగేది లేదు -సిరియా

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు యుద్ధ నగారాలు మోగిస్తుండగా సిరియా ప్రభుత్వం మాత్రం బెదిరేది లేదని స్పష్టం చేస్తోంది. కిరాయి తిరుగుబాటుదారులకు రసాయన ఆయుధాలు సరఫరా చేసి వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చింది ఈ మూడు దేశాలేననీ సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ స్పష్టం చేశాడు. సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించడానికి శిక్షణ ఇచ్చిన దేశాలే తిరిగి తమపై ఆరోపణలు చేయడం పిచ్చివాడి ప్రేలాపనలను పోలి ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. సాక్ష్యాలు ఉంటే ఎందుకు…

రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

ఎడ్వర్డ్ స్నోడెన్: రష్యాపై అమెరికా తీవ్ర అసంతృప్తి

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇవ్వడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. సెప్టెంబర్ లో రష్యా వెళ్లనున్న ఒబామా సందర్శనను తాము పునఃసమీక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ విలేఖరులకు తెలిపాడని హఫింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. రష్యాతో అమెరికాకు గల సంబంధాలు బహుముఖమైనవని, అయినప్పటికీ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన నేపధ్యంలో పుతిన్ తో ఒబామా జరపనున్న శిఖరాగ్ర సమావేశం సంభావ్యతను తాము పునర్మూల్యాంకనం చేస్తున్నామని కార్నీ…