అమెరికన్లు: ఉక్రెయిన్ ఎక్కడో తెలియదు, దాడికి రెడీ

ఉక్రెయిన్ ఎక్కడ ఉంది అనడిగితే అమెరికన్లకు తెలియదు. కానీ అమెరికా జాతీయ భద్రత పేరుతో మిలట్రీ దాడి చేయడానికి మాత్రం మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అమెరికాకే చెందిన యూనివర్శిటీల ప్రొఫెసర్ల బృందం ఒకటి జరిపిన సర్వేలో ఈ సంగతి తెలిసింది. యువకుల దగ్గర్నుండి పెద్దవారి దాకా ప్రపంచంలో ఉక్రెయిన్ ఎక్కడుందో గుర్తించమంటే సరిగ్గా గుర్తించినవారు నూటికి 16 మంది మాత్రమే. ఉక్రెయిన్ ని సరిగ్గా గుర్తించినవారు మిలట్రీ దాడికి వ్యతిరేకత వ్యక్తం చేయగా అసలు చోటుకు…