సిరియా సైన్యంపై అమెరికా దాడి, క్షమాపణలు!

ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకుంటున్న అమెరికా వాస్తవంలో దానికి మద్దతు ఇస్తున్నదని మరోసారి రుజువు అయింది. ఇస్లామిక్ స్టేట్ బలగాలపై పోరాడుతున్న సిరియా ప్రభుత్వ సైన్యాలపై అమెరికన్ ఫైటర్ జెట్ విమానాలు బాంబులు కురిపించి 60 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాయి. దానితో అమెరికా వాస్తవానికి ఇసిస్ తరపున సిరియా ప్రభుత్వ బలగాలతో తలపడుతున్నదని స్పష్టం అయిపోయింది. శనివారం సాయంత్రం సమయంలో అమెరికా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. దాడి…