అమెరికా వీసా ఫీజు పెంపులో హ్రస్వదృష్టి -ది హిందు

[Short-sighted hike in U.S. visa fee శీర్షికన ఈ రోజు ది హిందులో వెలువడిన సంపాదకీయానికి యధాతధ అనువాదం] ********** అమెరికాలో తాత్కాలిక పని కోసం వచ్చే వృత్తిగత నిపుణులకు వీసా ఫీజు పెంచుతూ బారాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐ.టి రంగంలోని భారతీయ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. ఈ చర్య వల్ల సంవత్సరానికి 400 మిలియన్ డాలర్ల (రమారమి రు. 2640 కోట్లు) నష్టం వస్తుందని (భారత సాఫ్ట్ వేర్) వాణిజ్య సంఘం…

వీసా ఇస్తామని అనుకోవద్దు, అమెరికా వివరణ

అమెరికా రాయబారి నరేంద్ర మోడిని కలవడానికి అపాయింట్ మెంట్ కోరినంత మాత్రాన తమ వీసా విధానంలో మార్పు ఉంటుందని భావించనవసరం లేదని అమెరికా విదేశాంగ శాఖ వివరణలాంటి సవరణ ప్రకటించింది. అమెరికా వీసా విధానంలో గానీ, ప్రపంచవ్యాపితంగా మానవహక్కులకు మద్దతుగా నిలవడంలో గానీ అమెరికా ఎలాంటి మార్పు చేసుకోలేదని గొప్పలు పోయింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి విలేఖరులకు వివరణ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలుసుకోవడానికి అమెరికా రాయబారి…

మోడీకి అమెరికా వీసా కావాలట!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి అమెరికా వీసా కావాలి. ఈ మేరకు తాము అమెరికాను కోరనున్నట్లు బి.జె.పి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ స్వయంగా తన మనసులో మాట వెలిబుచ్చారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ అక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. అమెరికా వీసా తమకు ముఖ్యం కాదని బి.జె.పి నాయకులు ఎప్పుడూ చెబుతుంటారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం…