అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -2

(ఒకటవ భాగం తరువాయి) ఇండియాలాగే చైనా కూడా. చైనా, పైకి తన కంపెనీలను ప్రవేటీకరణ చేసినట్లు చూపుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ఈక్విటీ కంపెనీలుగా మారడానికి ఆ దేశం అనుమతించింది. కొన్ని ఈక్విటీలను స్వదేశీ, విదేశీ ప్రవేటు మదుపుదారుల చేతుల్లో పెట్టింది. ఇది పైకి పూర్తిగా ప్రవేటీకరణ జరిగినట్లుగా కనిపించింది. వాస్తవానికి చైనాలొని అన్ని రంగాల కంపెనీల్లో చైనా ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుని ప్రవేటీకరణ కావించిన కంపెనీలపై కూడా తన పట్టు పోకుండా జాగ్రత్త…

అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -1

అమెరికా రుణ పరిమితి పెంపుదల, బడ్జెట్ లోటు తగ్గింపు లపై ఒప్పందం కుదిరి, ఆ మేరకు బిల్లును ప్రతినిధుల సభ, సెనేట్‌లు ఆమోదించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా బిల్లుపై సంతకం చేసి చట్టంగా అమెరికా మీదికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీదికి వదిలాడు. రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచడం ద్వారా అమెరికా అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ అవుతుందన్న భయం తప్పింది. కొత్త అప్పులు చేసి పాత అప్పుల చెల్లింపులు చేయడానికి అవకాశం…

కొనసాగుతున్న షేర్ల పతనం

భారత షేర్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా రుణ పరిమితి పెంపుపై సోమవారం ఒప్పందం కుదరడంతో లాభాలు పొందిన షేర్ మార్కెట్లు, మంగళవారం పాత భయాలు తిరిగి తలెత్తడంతో నష్టాలకు గురయ్యాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదించడం, యూరప్ లోని బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో అప్పు సంక్షోభంపై తిరిగి ఆందోళనలు తలెత్తడం, భారత ఆర్ధిక వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం ప్రతిబంధకంగా మారడం… ఇవన్నీ రంగం మీదికి రావడంతో షేర్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.…

అమెరికా రుణ పరిమితి పెంపుకు ఒప్పందం, ప్రతినిధుల సభ ఆమోదం

ఆగస్టు 2 లోగా అమెరికా రుణ పరిమితిని పెంచుతూ చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్న నేపధ్యంలో అనేక వారాల పాటు చర్చలు, తర్జన భర్జనలు జరిగాక ఎట్టకేలకు, అమెరికా ప్రతినిధుల సభ లోని డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు, వైట్ హౌస్ మధ్య ఆగస్టు 1 న ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన “ది బడ్జెట్ కంట్రోల్ యాక్ట్ 2011” ను  సభ్యులు 269-161 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన…