అమెరికా ప్రతినిధుల సభలో మోడి వ్యతిరేక తీర్మానం

నరేంద్ర మోడికి అమెరికా వీసా కష్టాలు కొనసాగుతున్నాయి. భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ అమెరికా పర్యటించినపుడు మోడి వీసా గురించి ప్రత్యేకంగా చర్చించినప్పటికీ ఫలితం దక్కినట్లు లేదు. అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives)లో సోమవారం ప్రవేశ పెట్టబడిన తీర్మానం చూస్తే ఈ అనుమానం రాక మానదు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉమ్మడిగా ప్రతిపాదించిన ఈ తీర్మానం, మోడీకి వీసా ఇవ్వరాదన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు అమెరికాను ప్రశంసించింది. మరో వంక,…