ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు…

ఇరాన్ ఆయిల్ కొనవద్దు, ఇండియాకి అమెరికా బెదిరింపు

తన మాట వినని దేశాలను బెదిరించి దారికి తెచ్చుకునే అమెరికా ఇండియాపై కూడా బెదిరింపులు మొదలు పెట్టింది. ఇరాన్ పై అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ ఆయిల్ కొనడం ఆపేది లేదని భారత దేశం చెప్పటంపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోని పక్షంలో అమెరికా బ్యాంకులను ఇండియాకి అందకుండా చేయడానికి తాము వెనకాడేది లేదని అమెరికా అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. అమెరికా తాను విధించిన…