అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం లేదు -మాజీ అధ్యక్షుడు

అమెరికాలో ప్రజాస్వామ్యం పని చేయడం లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పష్టం చేసేశారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న గూఢచార విధానాలు పచ్చి అప్రజాస్వామికమని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా అప్రజాస్వామిక గూఢచర్యం గురించి వెల్లడి చేయడం అమెరికాకు దీర్ఘకాలంలో లాభకరమని ఆయన వ్యాఖ్యానించారు.  జిమ్మీ కార్టర్ అమెరికాకు 1977 నుండి 1981 వరకు అధ్యక్షుడుగా పని చేశారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవిని…