క్లుప్తంగా… 28.04.2012

జాతీయం సోనియా సభలో నల్లజెండా కర్ణాటక పర్యటిస్తున్న సోనియా గాంధీకి ఒక మహిళ నల్ల జెండా చూపి కలకలం రేపింది. పోలీసులు ఆమె పైకి లంఘించి నోరు నొక్కి బైటికి వెళ్లగొట్టారు. తమ కమ్యూనిటీకి ఎస్.సి రిజర్వేషన్లు కల్పించాలని మహిళ డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కేవలం నల్ల జెండా చూపిస్తేనే మహిళ నోరు నోక్కే పోలీసు చట్టాలు ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకలో సోనియా గాంధీ చెప్పవలసి ఉంది. సిద్దగంగ మఠం వ్యవస్ధాపకుడి 105 వ…

రేమాండ్ ఖైదు, ఒసామా హత్యలతోనే అమెరికా-పాకిస్ధాన్‌ల సావాసం చెడింది -ఒబామా

పాకిస్ధాన్‌కు చెప్పకుండా పాక్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హత్య చేయడం వల్లనే పాకిస్ధాన్, అమెరికాల సంబంధాలు చెడిపోయాయని ఇప్పటిదాకా బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వాదిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ హత్య కోసం అమెరికా హెలికాప్టర్లు పాక్ గగనతలంలోకి చొరబడడం పాకిస్ధాన్ కు తెలియకుండా జరగదనీ, పాక్, అమెరికాల సంబంధాలు చెడడానికి ఒసామా హత్య కారణం కాదనీ ఈ బ్లాగర్ రెండు మూడు…

పాకిస్ధాన్‌పై దాడులు విస్తృతం చేస్తాం -అమెరికా

పాకిస్ధాన్ ప్రాంతాలపై ఒక్క డ్రోన్ దాడులే కాకుండా మరిన్ని విస్తృత పద్ధతుల్లో దాడులు చేస్తామని అమెరికాకి చెందిన రిపబ్లికన్ సెనెటర్ ఒకరు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. సీనియర్ సెనెటర్ అయిన లిండ్సే గ్రాహం, పాకిస్ధాన్‌లో అమెరికా మిలట్రీ చర్యలను విస్తృతపరచాలన్న అంశంపై అమెరికా విధాన కర్తలలో ఏకీభావం అంతకంతకూ పెరుగుతోందని ఆ సంస్ధ తెలిపింది. డ్రోన్ దాడులు ఇప్పటికే మిలిటెంట్లను టార్గెట్ చేస్తున్నాయని వాటితో పాటు బాంబర్లను కూడా వినియోగించే అవకాశం ఉందని గ్రాహం ఉప్పందించాడు. “అమెరికా…

అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని

దక్షిణాసియాలో అమెరికా పాకిస్ధాన్‌ను విస్మరించి ఇండియావైపు ముగ్గు చూపడం తమకు సమ్మతం కాదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నాడు. రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రచ్ఛన్న యుద్ధం కాలమంతా అమెరికా, పాకిస్ధాన్ లు మిత్రులుగా మెలిగిన సంగతిని గుర్తు చేశాడు. అలాంటిది అమెరికా పాకిస్ధాన్ ను వదిలిపెట్టి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకి మేలు చేయగల చర్య కాదని గిలాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా అమెరికా…

“నెగిటివ్ సందేశాలు పంపొద్దు” అమెరికాని కోరిన పాక్ ప్రధాని

అమెరికా, పాకిస్ధాన్ దేశాల రాజకీయ నాయకులు, అధికారుల మధ్య ‘మాటల యుద్ధం’ కొనసాగుతోంది. అమెరికానుండి ప్రతికూల సందేశాలు అందుతుండడం పట్ల పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మంగళవారం విచారం వ్యక్తం చేశాడు. హక్కానీ గ్రూపు మిలిటెంట్లపై దాడి పేరుతో పాకిస్ధాన్, ఆఫ్ఘన్ సరిహద్దును దాటి అమెరికా దాడులు చేసినట్లయితే అది పాక్ సార్వభౌమత్వానికి భంగం కలిగినించినట్లేనని హెచ్చరించాడు. “ప్రతికూల (నెగిటివ్) సందేశాలు మా ప్రజలను ఆందోలనకు గురిచేస్తున్నాయి. మా స్నేహ సంబంధాలకు అనుగుణం కాని రీతిలో…

పాక్‌కు అన్ని సాయాలు బంద్, అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

పాకిస్ధాన్‌కు అన్ని సహాయాలు బంద్ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడొకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. టెక్సాస్ నుండి ఎన్నికైన సభ్యుడొకరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన అమెరికా ప్రతినిధుల సభలో కీలక సభ్యుడని డెయిలీ భాస్కర్ పత్రిక పేర్కొంది. ఈ తీర్మానం కాంగ్రెస్ లో ఆమోదం పొందినట్లయితే అమెరికా, పాకిస్ధాన్ కు అందజేస్తున్న అన్ని సహాయాలు స్తంభించిపోతాయి. పాకిస్ధాన్ అణ్వస్త్రాలను భద్రపరచడానికి అందిస్తున్న సహాయాన్ని దీన్నుండి మినహాయించాడు. కాంగ్రెస్ సభ్యుడు టెడ్ పో, తాను ప్రవేశపెట్టిన…

సి.ఐ.ఎ కి ఇష్టమైన నీలి కళ్ల బాలుడే హక్కానీ నెట్ వర్క్ -పాక్ మంత్రి హీనా రబ్బానీ

పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి అమెరికాపై తన దండయాత్రను కొనసాగిస్తోంది. తీక్షణమైన ఖండన ప్రకటనలను జారీ చేయడంలో పేరు పొందిన హీనా రబ్బానీ తన పేరున నిలబెట్టుకుంటూ మరొక ప్రకటనను జారీ చేసింది. ప్రమాదకరమైన సంస్ధగా అమెరికా పరిగణిస్తున్న హక్కానీ గ్రూపు నెట్ వర్క్ మరొకటేదో కాదనీ, సి.ఐ.ఎ అత్యంత ఇష్టంగా రూపొందించుకున్న “నీలి కళ్ల బాలుడే” ననీ అమెరికా చేస్తున్న ప్రకటనలను తిప్పి కొట్టింది. రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు…

అమెరికన్లను ఇబ్బంది పెట్టడం ఆపాలని పాక్‌ని కోరిన అమెరికా

పాకిస్దాన్ లో ఉన్న అమెరికన్లను ఇబ్బంది పెట్టడం (harassment) ఆపాలని అమెరికా కోరింది. అమెరికా రాయబారుల కదలికలపై పాకిస్ధాన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని కూడా అమెరికా పాక్ ప్రభుత్వాన్ని కోరింది. లాహోర్ లో నివసిస్తున్న ఒక అమెరికన్‌ను తుపాకులు ధరించిన కొద్దిమంది కిడ్నాప్ చేసిన అనంతరం ఈ విజ్ఞప్తులు అందాయి. అమెరికా సీనియర్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ (ఒబామాతో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన రిపబ్లికన్) పాకిస్ధాన్ సైన్యం అధిపతి జనరల్ అష్‌ఫాక్…

బిన్ లాడెన్ ఇంట్లో కూలిన అమెరికా హెలికాప్టర్ చూడ్డానికి చైనాను అనుమతించిన పాక్

అమెరికా, పాక్ ల మధ్య చెడిన సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఆ ప్రయత్నాలకు ఆటంకం కలిగించే ఒకసంఘటనను ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. లాడెన్ హత్యలో పాల్గొన్న స్టెల్త్ (రాడార్ల లాంటి పరికరాలకు దొరకనివి) హెలికాప్టర్లలో ఒకటి లాడెన్ ఇంటివద్దనే కూలిపోయింది. అత్యాధునిక పరికరాలు ఆ విధంగా కూలిపోయినపుడు వాటి గురించిన సమాచారం ఇతర దేశాలకు తెలియకుండా ఉండడానికి కూలిపోయిన వెంటనే అమెరికా ధ్వంసం చేస్తుంది. లాడెన్ స్ధావరంలో కూలపోయిన హెలికాప్టర్ బాడీ…

ముదిరిన సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల విభేధాలు, ఐ.ఎస్.ఐ ఛీఫ్ రహస్య చైనా పర్యటన

అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సాగిన యాభై సంవత్సరాల పాటు అమెరికాకి దక్షిణాసియాలో నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చిన పాకిస్ధాన్‌తో, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒకవైపు ఇండియా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందగా, మరొక వైపు పాకిస్ధాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధి చెందాయి. స్నేహ సంబంధాలు అనడం కంటే, భారత్, పాకిస్ధాన్‌ల పాలక వర్గాలు తమ…

ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు

90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన…