భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం

శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభాన్ని తలపించాయి. అమెరికాలో ఆశావాహ పరిస్ధితులు నెలకొన్నాయని భావించిన అంతర్జాతీయ మదుపరులు భారత స్టాక్ మార్కెట్ల నుండి, రూపాయి నుండి తమ సొమ్ము ఉపసంహరించుకుని డాలర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టడంతో రూపాయి ఢమాల్ మని కూలిపోయింది. రూపాయితో పాటు స్టాక్ సూచీలు కూడా ఒక్కుమ్మడిగా కూలిపోయాయి. మార్కెట్ల పతనాన్ని పత్రికలు రక్తపాతంతో పోల్చుతున్నాయి. ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ను…

తీవ్ర సామాజిక సంక్షోభంలో అమెరికా

2007-08లో వాల్ స్ట్రీట్ కంపెనీలు తెచ్చిపెట్టిన ఆర్ధిక సంక్షోభం అమెరికన్ ప్రజలను పట్టి పల్లార్చుతోంది. పెట్టుబడిదారీ కంపెనీలు తమ సంక్షోభాన్ని కార్మికవర్గం పైకీ, ప్రజా సామాన్యం పైకీ బదలాయించడంలో విజయవంతం కావడంతో అమెరికన్ ప్రజానీకం సామాజిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. సంక్షోభం తెచ్చిన ‘టూ బిగ్ టు ఫెయిల్’ కంపెనీలు ఎప్పటిలా భారీ లాభాలతో అలరారుతుండగా కార్మికులు, ఉద్యోగులు నిరుద్యోగం, దరిద్రం, ఆకలి, రోగాలతో సతమతం అవుతోంది. గత మూడున్నర సంవత్సరాలలోనే కోట్లాది మంది అమెరికన్లు పని…

అమెరికా నిరుద్యోగం నిజంగానే తగ్గిందా?

సెప్టెంబర్ లో అమెరికా నిరుద్యోగం 8.1 శాతం నుండి 7.8 శాతానికి తగ్గిందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బి.ఎల్.ఎస్) రెండు రోజుల క్రితం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని బి.ఎల్.ఎస్ ప్రకటించడంతోటే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు సంతోషాన్ని ప్రకటించాయి. అమెరికా నిరుద్యోగం తగ్గినందుకు ఆశ్చర్యానందాలని ప్రకటించాయి. స్టాక్ మార్కెట్ల లాభాల్ని కూడా ఉపాధి నివేదికకి ఆపాదించి సంతృప్తి చెందాయి. అనుకోకుండా శుభవార్త విన్నామని శీర్షికలు పెట్టి మంచి రోజులు రానున్నాయని అమెరికా…

అమెరికా నిరుద్యోగం -కార్టూన్లు

పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు ‘నిరుద్యోగం’ కొత్త సాధారణ లక్షణం (new normal) గా మారిపోయింది. ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించినట్లయితే అందులో ‘జాబ్ గ్రోత్’ కూడా కలిసి ఉండడం నియమం. కాని 2008 ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించామని చెబుతున్నప్పటికీ అందులో ‘జాబ్ గ్రోత్’ లేదు. దానితో ఆర్ధిక వేత్తలు ఇప్పటి రికవరీని ‘జాబ్ లెస్ రికవరీ’ గా పేర్కొంటున్నారు. ‘జాబ్ గ్రోత్’ లేని రికవరీ, అసలు రికవరీ కానే కాదు. అందుకే…

ఒబామా అభిమానులా? నిరుద్యోగులా? -కార్టూన్

ఎన్నికల సంవత్సరంలో బారక్ ఒబామాకి నిరుద్యోగులకీ, అభిమానులకీ తేడా తెలియడం లేదు. భారత దేశంలో లాగానే పశ్చిమ దేశాల్లో కూడా ఎన్నికలు దగ్గర్లో ఉన్నపుడు కంపెనీలకు అనుకూలమైన విధానాలు మానేసినట్లూ, ప్రజల ప్రయోజనాల కోసమే కట్టుబడి ఉన్నట్లూ పాలకులు నాటకాలాడతారు. నిన్నటిదాకా సిరియాలో జోక్యం కోసం ఉవ్విళ్లూరిన ఒబామా అర్జెంటుగా కోఫీ అన్నన్ ని పంపి సిరియా అధ్యక్షుడు అస్సాద్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది అందుకే. ఇరాన్ విషయంలో ‘ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ ది…

బక్కచిక్కుతున్న అమెరికా మధ్య తరగతి -కార్టూన్లు

అమెరికా మధ్య తరగతి జనం దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఒక మూల స్తంభంగా పని చేసిందని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో మధ్య తరగతి వర్గం విస్తృతంగా అభివృద్ధి చెందింది. దానికి కారణం ‘సోషలిస్టు వ్యవస్ధ’. అమెరికాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధే అయినా రష్యా, చైనాలలో సోషలిస్టు విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాలు విజయవంతం అయ్యాక ఏర్పడిన సోషలిస్టు వ్యవస్ధలు అమెరికా, యూరప్ లలో సో కాల్డ్…

US economy

విదేశాల్లో కుట్రలు, స్వదేశంలో నిరుద్యోగం -కార్టూన్

– బారక్ ఒబామా: మనం బడా టెర్రరిస్టులని తుడిచి పెట్టాం. అరబ్ ప్రజాస్వామిక ఉద్యమాలు పెరగడానికి సాయపడ్డాం. ఇరాక్ కి ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనీ ప్రసాదించాం… అమెరికా పౌరుడు: గుడ్ జాబ్. మారి నా ఉద్యోగం సంగతేంటి? అదీ సంగతి! పాకిస్ధాన్ అనుమతి లేకుండా, ఆ దేశం గగనతలం లోకి జొరబడి, ఒసామా బిన్ లాడెన్ ని చంపేశామని చెప్పిన ఒబామా ఇంతవరకూ అతని శవాన్ని కూడా చూపలేదు. తమ అనుకూల ఎన్.జి.ఒ సంస్ధల సాయంతో నియంతృత్వం ప్రభుత్వాలపై…

అమెరికా కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది -ఒబామా

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శుక్రవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో కొద్దిగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ అది శాశ్వతం కాదని ఆర్ధిక విశ్లెషకులు భావిస్తున్నారు. బారక్ ఒబామా అంచనా సైతం దాని ధృవీకరిస్తోంది. సిబి.ఎస్ టెలివిజన్ కి చెందిన “60 మినిట్స్” కార్యక్రమానికి ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం ఇచి ప్రసారం కానున్నది. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో సమస్యల పరిష్కారాన్ని తక్కువ…

అమెరికాలో ఉద్యోగాల వేట -కార్టూన్

కార్పొరేట్ కంపెనీలన్నీ బెయిలౌట్లు మెక్కినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సుతరామూ ఇస్టపడడం లేదు. ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ జోక్యాన్ని విమర్శించే కార్పొరేట్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన  బెయిలౌట్లు తేరగా మెక్కి బ్రేవ్ మని త్రేన్చి తిరిగి ఉద్యోగాల రూపంలో చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం నుండి అమెరికా సాధించిన రికవరీ ‘జాబ్ లెస్ రికవరీ’ గా చరిత్రలో మొదటిసారి చరిత్ర పుటలకు ఎక్కనుంది. – –

సెప్టెంబరులోనూ కొద్ది ఉద్యోగాలే, ఇంకా క్షీణించిన అమెరికా నిరుద్యోగం

అమెరికా నిరుద్యోగ పర్వం కొనసాతోంది. ఉద్యోగలను సృష్టించడంలో ఏ మాత్రం మెరుగుదల చూపలేకపోతోంది. ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బలహీన ఉపాధి లెక్కలు మరొక మాంద్యంలోకి జారిపోతుందన్న భయాలు సజీవంగా ఉంచుతున్నాయి. సెప్టెంబరు నెలకు గాను అమెరికాలో నికరంగా 103,000 ఉద్యోగాల సృష్టి జరిగినట్లుగా అమెరికా ఉపాధి నివేదిక వెల్లడించింది. ప్రవేటు రంగం 137,000 ఉద్యోగాలను సృష్టించగా, ప్రభుత్వరంగం 34,000 ఉద్యోగాలను కోల్పోయింది. అమెరికా జనాభా వృద్ధి రేటుకు తగినట్లుగా ఉద్యోగాల…

ఒబామా ఉద్యోగాల వంటకం -కార్టూన్

అమెరికాలో నిరుద్యోగం 9.1 శాతం అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నప్పటికీ వాస్తవానికి అది 16 శాతంపైనే ఉంటుందని ఆర్ధికవేత్తలు దాదాపుగా ఏకీభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం నాటి ఆర్ధిక మాంద్యం నుండి కోలుకున్నామని చెబుతున్నప్పటికీ ఈ రికవరీ వాస్తవానికి ఉద్యోగాలు ఏమీ కల్పించలేకపోయింది. ఉద్యోగాల సృష్టి లేని రికవరీ వాస్తవానికికి రికవరీగా పరిగణించలేము. అందుకే అమెరికా రికవరీని జాబ్‌లెస్ రికవరీగా పేర్కొంటున్నారు. ఉపాధి కల్పించకుండా ఆర్ధిక వృద్ధి సాధించడం అసాధ్యమని ఐ.ఎం.ఎఫ్ అనేకసార్లు చెప్పిన…

ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని అమెరికా, ముసురుకుంటున్న డబుల్ డిప్ భయాలు

ఘనత వహించిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయింది. ముప్ఫై కోట్ల జనాభాలో ముప్ఫై రోజుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నికరంగా ఉద్యోగం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వానికి రక్షణ బాధ్యత, పాలన బాధ్యత తప్ప మిగిలినవి ఏవీ ఉండకూడదు. ఇతర అన్ని కార్యకలాపాలనూ మార్కెట్‌కే అప్పజెప్పాలని ప్రపంచానికి నిత్యం బోధలు చేసే కార్పొరేట్ అమెరికా ఉద్యోగాలు ఇవ్వకుండా లాభాలను మాత్రం బిలియన్ల కొద్దీ డాలర్లు ప్రకటిస్తోంది. ఉద్యోగాలివ్వని లాభాలవి. ఉద్యోగాలివ్వని వ్యాపారమది. ఉద్యోగాలివ్వని ఉత్పత్తి…

అమెరికాలో “ది గ్రేట్ రిసెషన్” తర్వాత మొలిచిన కొత్త ఉద్యోగాలు కేవలం “అర మిలియన్” -టేబుల్

ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన “ది గ్రేట్ రిసెషన్,” అమెరికాలో డిసెంబరు 2007 లో ప్రారంభం కాగా, జూన్ 2009 లో ముగిసిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుండి అమెరికాలో ప్రవేటు కంపెనీలు రిసెషన్ ముందు స్ధాయిలో లాభాలు సంపాదిస్తుండగా, ఉద్యోగాల మార్కెట్ మాత్రం ఇంకా కోలుకోలేదు. సంక్షోభం ముగిసాక జూన్ 2009 లో అమెరికాలో 130.5 మిలియన్ల ఉద్యోగాలు ఉండగా, వాటి సంఖ్య రెండేళ్ళ తర్వాత జూన్ 2011 నాటికి కేవలం అర మిలియన్…

బలహీనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, రానున్న వారాల్లో షేర్లు మరింత పతనం

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు మరికొన్ని వారాల పాటు నష్టాలను నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రెండో అర్ధ భాగం నుండే అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో, మార్కెట్లకు ఊపు ఇవ్వడానికి ఉద్దీపనా ప్యాకెజీ ఇవ్వడానికి నిశ్చయించి, ఆగష్టు నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ -2 (క్యు.ఇ – 2) ప్రకటించింది. అమెరికా ట్రెజరీ బాండ్లను…