తాలిబాన్ సరే, డ్రోన్ దాడుల లెక్క తేల్చరా?

ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అనే తీవ్రవాద సంస్ధ పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పైకి ఆత్మాహుతి మిలిటెంట్లను పంపి 132 మంది పిల్లలను, టీచర్లను బలిగొన్న వార్త ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తాలిబాన్ పైశాచికత్వం తలచుకుని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుపితులై పిడికిళ్ళు బిగిస్తున్నారు. ‘వారు పిల్లల్ని ఎలా చంపారో వారినీ అలానే చంపాలి’ అప్పుడే తగిన శాస్తి’ అన్న నిర్ణయానికి రాకపోతే వారిలో ఏదో లోపం ఉందన్నంతగా భావోద్వేగాలు…