అబ్బోత్తాబాద్ స్ధావరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరా? అబ్బే, అంత సీన్ లేదు -అమెరికా, పాక్ అధికారులు

పాకిస్ధాన్‌‌లోని  అబ్బోత్తాబాద్‌ పట్టణంలో గల లాడెన్ స్ధావరమే ఆల్-ఖైదా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారని అమెరికా చెప్పడాన్ని అటు అమెరికాలోనూ, ఇటు పాకిస్తాన్ లోనూ చాలామంది అంగీకరించ లేకపోతున్నారు. లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న స్ధావరంలో అతన్ని హత్య చేశాక అక్కడినుండి చాలా సమాచారాన్ని తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం ఒకేఒక టెర్రరిజం అనుమానితుడి వద్ద దొరికిన అతి పెద్ద గూఢచార సమాచారాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ద్వారా లాడెన్ చివరివరకూ చురుగ్గా…

లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్

ఒసామా బిన్ లాడెన్‌ స్ధావరంగా చెప్పబడుతున్న ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురు యువకుల శవాల ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సంపాదించింది. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అమెరికా కమేండోలు దాడి చేసి వెళ్ళిన గంట తర్వాత ఈ ఫోటోలు తీశారని ఆ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ భద్రతా అధికారి ఒకరు ఒసామా స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమెండోలు వెళ్ళిన గంట తర్వాత వెళ్ళి తీసిన ఫోటోలను…

ఒసామా మృతి తాలూకు ఫోటోల విడుదలకు భయపడుతున్న ఒబామా

ప్రపంచ పోలీసు అమెరికా అధ్యక్షుడు ఒబామాని చనిపోయిన ఒసామా బిన్ లాడెన్ ఇంకా భయపెడుతూనే ఉన్నాడు. ఒసామాని చంపినట్లు రుజువులు చూపాలని అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. కాని ఒసామా మృతి చెందిన ఫోటోలు విడుదల చేస్తే, భీకరంగా ఉన్న ఆ చావు వలన అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎన్.బి.సి టెలివిజన్‌కి ఇచ్చిన…