పాక్ సైనికుల హత్యకు బదులు, ఆఫ్గన్ కాన్ఫరెన్సు బహిష్కరణకు పాక్ నిర్ణయం

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దు వద్ద రెండు చెక్ పోస్టుల వద్ద మొహరించి ఉన్న పాక్ సైనికులను 28 మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు చంపినందుకు నిరసనగా జర్మనీ లోని బాన్ నగరంలో జరగనున్న ఆఫ్ఘనిస్ధాన్ కాన్ఫరెన్సుకు హాజరు కాకూడదని పాకిస్ధాన్ నిర్ణయించింది. కాన్ఫరెన్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ యుద్ధానికి సంబంధించి కీలక పాత్ర పొషిస్తున్న పాకిస్ధాన్ గైర్హాజరీ లో ఆఫ్ఘనిస్ధాన్ పై కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. పాకిస్ధాన్ సహాయం లేనట్లయితే ఆఫ్ఘనిస్ధాన్…

అమెరికా కండకావరం: కాల్పులు ఆపమని విజ్ఞప్తి చేసినా పట్టించుకోని వైనం

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికాకి సహకరిస్తున్నందుకు పాకిస్ధాన్ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సంవత్సరం క్రితం అమెరికా హలికాప్టర్ల కాల్పుల్లో ఇద్దరు సైనికులను నష్టపోయిన పాకిస్ధాన్, గత శనివారం అమెరికా హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ విమానాలు జరిపిన దాడిలో చెక్ పోస్టు వద్ద కాపలా ఉన్న 28 మంది సైనికులను (24 మంది అని ‘ది హిందూ‘, ‘ఫస్ట్ పోస్ట్‘ పత్రికలూ, 25 మంది అని ‘ది గార్డియన్‘ పత్రికా చెబుతున్నాయి) కోల్పోయిన సంగతి విదితమే. అమెరికా హెలికాప్టర్లు,…