డీమానిటైజేషన్: అమెరికా చెప్పిందే మోడీ చేశారు!

[పై కత్తిరింపును పి‌డి‌ఎఫ్ లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి] ఇలాంటి వాస్తవాలను సాధారణంగా భారతీయ పత్రికలు ప్రచురించవు. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కధనాలు ఇండియాలో దర్శనం ఇస్తాయి. అంతర్జాతీయ పరిణామాలలో కూడా భారత పత్రికలు పశ్చిమ వార్తా సంస్ధల కథనాలను మాత్రమే అనుసరిస్తాయి తప్ప తాము సొంతగా పరిశోధన చేసి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు చేయవు. తమకు తగిన సిబ్బంది లేనందున అలా చేయడం తప్పదని అవి తమను తాము సమర్ధించుకుంటాయి…

ఎఫ్‌బి‌ఐ వల్లే ఓడిపోయా -హిల్లరీ క్లింటన్

డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయి విచారంలో ఉన్న హిల్లరీ క్లింటన్ తన ఓటమికి మరో చోట కారణాలు వెతుకుతోంది. తన తప్పుల్ని పక్కన బెట్టి ఆ తప్పుల్ని బైటపెట్టిన వారిని నిందిస్తోంది. ఒబామా మొదటి అధ్యక్ష పదవి కాలంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశీ మంత్రి) గా పని చేసినప్పుడు ఈ మెయిల్ సేవల కోసం అధికారిక భద్రతలతో కూడిన సర్వర్లకు బదులుగా ప్రైవేటు సర్వర్లను వినియోగించి ప్రభుత్వ రహస్యాలను వాల్ స్ట్రీట్ కంపెనీలకు అప్పజెప్పడంపై ఎఫ్‌బి‌ఐ…

అమెరికా: విజితులు, పరాజితులు -ఫోటోలు

డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అనేక ఆరోపణలు ఆయనపైన గుప్పించారు. పాత చరిత్రలు తవ్వి తీశారు. ఎక్కడా లేని బురదా తెచ్చి జల్లారు. ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆయనకు వ్యతిరేకంగా చెప్పించారు. అయినా ట్రంప్ గెలుపు ఆగలేదు. మొత్తం వాల్ స్ట్రీట్ అంతా కట్టగట్టుకుని హిల్లరీ క్లింటన్ వెనక నిలబడ్డా ఆమెను గెలిపించలేకపోయింది. ఆమె వాల్ స్ట్రీట్ మనిషి అన్న నిజమే అమెరికా శ్రామిక ప్రజలను ఆమెకు వ్యతిరేకంగా నిలబెట్టింది.…

గెలుపు బాటలో ట్రంప్, మార్కెట్లలో రక్తపాతం!

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డోనాల్డ్ అమెరికా ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుపు బాటలో దూసుకుపోతున్నాడు. ఎన్నికల ముందు జరిగిన సర్వేలు అన్నింటిలో హిల్లరీ క్లింటన్ పై చేయి సాధిస్తే అసలు ఫలితాల్లో మాత్రం హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్ పై చేయి సాధిస్తున్నాడు. ఈ ఫలితాలతో ఆసియా షేర్ మార్కెట్లలో ఊచకోత మొదలయింది. రక్తపాతం జరుగుతోంది. (షేర్ మార్కెట్లు భారీగా కూలిపోతే దాన్ని బ్లడ్ బాత్ గా పశ్చిమ పత్రికలు చెబుతాయి.) కడపటి…

అమెరికా ఇక ప్రపంచ పోలీసు కాజాలదు -ట్రంప్

  తదుపరి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య మొదటి చర్చ అమెరికాలో ప్రారంభం అయింది. అమెరికా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగబోయే లోపు అధ్యక్ష పదవికి పోటీ లో ఉన్న అభ్యర్థులు బహిరంగ చర్చ (డిబేట్) లో మూడు సార్లు పాల్గొనవలసి ఉంటుంది.   ఈ చర్చలలో అభ్యర్థులు తమ ఆర్ధిక, రాజకీయ, విదేశాంగ విధానాలతో పాటు దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తాము ఎలా పరిష్కరిస్తామో…

ఐఎస్ స్ధాపకుడు ఒబామా -ఫ్రమ్ ద హార్స్ మౌత్!

ఇస్లామిక్ స్టేట్ వ్యవస్ధాపకుడు ఎవరు? అమెరికా ఇన్నాళ్లూ చెప్పింది ఇరాకీ సున్నీ నేత అబూ ముసబ్ ఆల్-జర్కావి అని. ఐఎస్ నెలకొల్పిన ఇస్లామిక్ కాలిఫేట్ కు అబూ బకర్ ఆల్-బాగ్దాది అని ఒబామా ప్రభుత్వం, అమెరికన్ మీడియా చెవినిల్లు కట్టుకుని మరీ చెప్పాయి. ఐఎస్ వ్యవస్ధాపకత్వం లోకి వెళ్ళే ముందు 9/11 దాడుల గురించి కొన్ని అంశాలు చెప్పుకోవాలి. 9/11 దాడులు జరిగినప్పుడు కొన్ని గంటల లోపే ఆ దాడులు చేసింది ఆల్-ఖైదా అనీ, చేయించింది ఒసామా…

డొనాల్డ్ ట్రంప్: ప్రపంచీకరణని తిరగదోడతాడా?

నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక వింత పరిస్థితిని ప్రపంచ ప్రజల ముందు ఉంచుతున్నాయి. రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు తమ సాంప్రదాయ రాజకీయార్ధిక, సామాజికార్ధిక ప్రాధామ్యాలను పక్కనబెట్టి ప్రత్యర్ధి ప్రాధామ్యాలను సొంతం చేసుకోవడమే ఆ వింత పరిస్ధితి! సాధారణంగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ రాజకీయంగా, సామాజికంగా కన్సర్వేటివ్ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్థికంగా ధనిక వర్గాలకు, కంపెనీలకు, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తుంది. డెమొక్రటిక్…

హిల్లరీ: ఆమె గాజు పైకప్పు బద్దలు కొట్టారట!

అమెరికా డెమోక్రటిక్ పార్టీ జరిపిన సదస్సులో హిల్లరీ రోధమ్ క్లింటన్ అధ్యక్ష పదవి అభ్యర్థిగా అధికారికంగా నామినేషన్ పొందారు. ఆమె నామినేషన్ ను అమెరికా పత్రికలు, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా వచ్చే మీడియా “చరిత్ర సృష్టి” గా ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తరచుగా కీర్తించుకునే అమెరికాలో అభ్యర్థి పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందిన మొట్టమొదటి మహిళ హిల్లరీ క్లింటన్ కావడమే వారి ఉబ్బితబ్బిబ్బులకు కారణం. అమెరికాకు స్వతంత్రం వచ్చి 240 యేళ్ళు…

క్లుప్తంగా …8/6/2016

తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! పోరాటం కొనసాగుతుంది -శాండర్స్ సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు కేరళను తాకిన నైరుతి ఋతుపవనం రాజన్ భారతీయుడే -ఆర్‌బి‌ఐ తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! మే 2014 నుండి ఇసిస్ ఆక్రమణ లో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాకీ బలగాలు విముక్తి చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వ బలగాలు పురోగమించే కొద్దీ స్ధానిక ప్రజలపై ఇసిస్ మూకలు సాగించిన దౌర్జ్యన్య కాండ…

Occupy white house

రీ-ఆకుపై వాల్‌స్ట్రీ… సారీ, వైట్‌హౌస్

ఈ సంవత్సరం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా గెలుపొందడం కోసం ఒబామా వేషాలు పునః ప్రారంభమయ్యాయి. ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాడు. ధనికులు పై పన్నులు పెంచుతాననిక్, వారి పన్ను రాయితీలు రద్దు చేస్తానని నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ఒబామా తన వాగ్దానాలను అమలు చేయలేదు. తిరిగి అవే వాగ్దానాలను చేయడానికి ఒబామా సిగ్గుపడకపోవడమే ఆశ్చర్యం. – –