మానసిక యుద్ధంలో భాగమే అమెరికా ఎంబసీపై తాలిబాన్ దాడి

20 గంటల పోరాటం అనంతరం తాలిబాన్ దాడి ముగిసింది. దాడిలో పాల్గొన్న తాలిబాన్ మిలిటెంట్లు అందరూ చనిపోవడంతో ఆపరేషన్ ముగిసింది. మంగళవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ‘అత్యున్నత భద్రతా జోన్’ లో తాలిబాన్ మిలిటెంట్లు దాడికి పూనుకున్న సంగతి విదితమే. అమెరికా ఎంబసీకి సమీపంలోనే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవంతిని అదుపులోకి తీసుకున్న తాలిబాన్ మిలిటెంట్లు బుధవారం వరకూ ఇరవై గంటలపాటు ఆఫ్ఘన్, అమెరికన్ సైనికుల ప్రతిఘటనను ఎదుర్కొని నిలబడ్డారు. దాడిలో భారీ ఆయుధాలు ఏవీ…