ఆసియాలో ఇండియా సభ్య దేశంగా మరో ‘క్వాడ్’ కూటమి

చైనా, రష్యాలకు వ్యతిరేకంగా… ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేస్తున్న వ్యూహాత్మక కూటముల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ లతో కలిపి ‘క్వాడ్’ కూటమిని తయారు చేసిన అమెరికా ఇప్పుడు పశ్చిమాసియా కేంద్రంగా మరో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో అమెరికా, ఇండియాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూ‌ఏ‌ఈ), ఇజ్రాయెల్ లు సభ్య దేశాలుగా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా ఆశీస్సులతో వైట్…

యుద్ధోన్మాది మెక్ కెయిన్ ఇండియా పర్యటన

కరడు గట్టిన యుద్ధోన్మాది, అమెరికా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఇండియా పర్యటన కోసం వేంచేశారు. దేవయాని ఖోబ్రగదే వ్యవహారం వల్ల చెడిన ఇండియా-అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించడానికి మెక్ కెయిన్ పర్యటన ఉద్దేశించబడింది. మెక్ కెయిన్ రాకకు మునుపు బి.జె.పి పార్టీపై గూఢచర్యం నిర్వహించడానికి అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనుమతి సంపాదించిందన్న సమాచారాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పటికీ అమెరికాతో దృఢమైన సంబంధాల పెంపుదలకు మోడి ప్రభుత్వానికి ఏమీ ఆటంకం కాలేకపోయింది.…

రేమండ్ డేవిస్ ని గుర్తు చేసుకో అమెరికా! -పాక్ మాజీ రాయబారి

అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీలో మాజీ అత్యున్నత రాయబారిగా పని చేసిన హుస్సేన్ హక్కాని అమెరికా పౌరుడు, సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపిన కేసు విషయంలో పాక్ ప్రభుత్వ అసంతృప్తికి గురై ఉద్వాసన పొందడం విశేషం. “అనేక దేశాలలో అమెరికా రాయబారులకు అక్కడి చట్టాలకు అతీతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి… విదేశాల్లోని ప్రతి అమెరికా రాయబార భవనం చుట్టూ రక్షణ నిర్మాణాలు (barriers) అమర్చి ఉంటాయి. సాధారణంగా ఈ నిర్మాణాలు ప్రజల…

దేవయాని కేసు రద్దు చేసేది లేదు -అమెరికా

భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లుగా దేవయాని ఖోబ్రగదే పైన మోపిన కేసులను రద్దు చేయబోమని అమెరికా నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఇందులో మరో ఆలోచనకు తావు లేదని తేల్చి చెప్పింది. సంగీతా రిచర్డ్స్ పై ఢిల్లీలో నమోదు చేసిన కేసు విషయంలో భారత ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ అమెరికా పట్టించుకోలేదన్న ఆరోపణను కూడా అమెరికా తిరస్కరించింది. భారత ప్రభుత్వంతో తాము నిరంతరం సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూనే ఉన్నామని అమెరికా వాదించింది. పైగా ఇండియాయే తమ లేఖలకు స్పందించలేదని…

సంగీత నోరు మూయించేందుకే ఇండియాలో అక్రమకేసు -అమెరికా

దేవయాని కేసు విషయంలో అమెరికా తన దూకుడు కొనసాగిస్తోంది. ఈసారి తన ప్రాసిక్యూటర్ చేత తాను అనాలనుకున్న మాటల్ని చెప్పించింది. సంగీతను ఇండియా వేధిస్తున్నదనీ ఆమెను రక్షించేందుకే ఆమె కుటుంబాన్ని భారత్ నుండి ‘ఖాళీ చేయించామని’ అమెరికా ప్రాసిక్యూటర్ ప్రీత్ భరార ఆరోపణలు గుప్పించాడు. తద్వారా భారత న్యాయ వ్యవస్ధపైనే అమెరికా దాడి ఎక్కుపెట్టింది. పని మనుషుల హక్కులను ఇండియా హరిస్తుంటే తాను ఆర్తత్రాణపరాయణుడిలా వచ్చి వారిని ఆదుకోక తప్పలేదని అమెరికా ఫోజు పెడుతోంది. అసలు భారత…

దేవయాని అరెస్టుకు ముందు అమెరికా ఎంబసీలో ఏం జరిగింది?

న్యూయార్క్ లో భారత (మాజీ) డిప్యూటీ కాన్సల్ జనరల్  దేవయాని ఖోబ్రగదే పై మోపిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఇండియా డిమాండ్ చేస్తోంది. వీసా ఫ్రాడ్ కేసును అమెరికా కొనసాగించరాదని, కేసును వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదని భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ బుధవారం తనకు ఫోన్ చేశారని కానీ ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆయన తెలిపారు. అయితే ఇది నిజం…

అమెరికా కుట్ర: దేవయాని అరెస్టు ముందే పని మనిషికి వీసా

దేవయాని అరెస్టు వెనుక కుట్ర ఉన్నదన్న ఆమె తండ్రి ఆరోపణలు నిజం చేసే సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ పనిమనిషికైతే వీసా ఇప్పించడంలో దేవయాని మోసానికి (ఫ్రాడ్) పాల్పడ్డారని అమెరికా ఆరోపించి అమానవీయ పద్ధతిలో అరెస్టు చేసి నిర్భంధింఛిందో అదే పని మనిషికి దేవయాని అరెస్టుకు రెండు రోజుల క్రితమే పూర్తి స్ధాయి వీసా మంజూరు చేసి అమెరికా తరలించారని వెల్లడి అయింది. దేవయాని ఇంటి నుండి మూడు నెలల క్రితం మాయామయిన సంగీతా రిచర్డ్స్ ఆనుపానులు…

దెబ్బకు దెబ్బ: అమెరికా రాయబారుల హోదా కుదించిన ఇండియా

భారత ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారి దేవయాని అరెస్టుకు ఇండియా లేటుగా అయినా ఘాటుగా స్పందిస్తోంది. న్యూయార్క్ లోని ఇండియా కాన్సల్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న దేవయానిని అరెస్టు చేయడమే గాక దురహంకార పూరిత పద్ధతుల్లో ఆమెను బట్టలు విప్పించి వెతికారని, పెట్టీ దొంగలు, వ్యభిచారుణులు, హంతకులతో కలిపి పోలీసుల సెల్ లో నిర్బంధించారని వార్తలు వెలువడిన నేపధ్యంలో ఇండియాలోని అమెరికా రాయబారుల పట్ల తాము వ్యవహరిస్తున్న తీరును…