తీవ్ర సామాజిక సంక్షోభంలో అమెరికా

2007-08లో వాల్ స్ట్రీట్ కంపెనీలు తెచ్చిపెట్టిన ఆర్ధిక సంక్షోభం అమెరికన్ ప్రజలను పట్టి పల్లార్చుతోంది. పెట్టుబడిదారీ కంపెనీలు తమ సంక్షోభాన్ని కార్మికవర్గం పైకీ, ప్రజా సామాన్యం పైకీ బదలాయించడంలో విజయవంతం కావడంతో అమెరికన్ ప్రజానీకం సామాజిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. సంక్షోభం తెచ్చిన ‘టూ బిగ్ టు ఫెయిల్’ కంపెనీలు ఎప్పటిలా భారీ లాభాలతో అలరారుతుండగా కార్మికులు, ఉద్యోగులు నిరుద్యోగం, దరిద్రం, ఆకలి, రోగాలతో సతమతం అవుతోంది. గత మూడున్నర సంవత్సరాలలోనే కోట్లాది మంది అమెరికన్లు పని…

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతోంది -ఐ.ఎం.ఎఫ్

2008 ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకుంటోందని భావిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతున్నదని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాల విధానాలు నమ్మకాన్ని పునరుద్ధరించడంలో విఫలం కావడంతో ప్రపంచ ఆర్ధిక వృద్ధి క్షీణ దశలోకి జారిపోయిందని ప్రపంచ ద్రవ్య సంస్ధ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఆర్ధిక వ్యవస్ధ మరింతగా క్షీణించే సూచనలు గణనీయంగా ఉన్నాయని కూడా ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. 2013 లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు 3.9 శాతం ఉంటుందని గత…

అమెరికా నిరుద్యోగం నిజంగానే తగ్గిందా?

సెప్టెంబర్ లో అమెరికా నిరుద్యోగం 8.1 శాతం నుండి 7.8 శాతానికి తగ్గిందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బి.ఎల్.ఎస్) రెండు రోజుల క్రితం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని బి.ఎల్.ఎస్ ప్రకటించడంతోటే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు సంతోషాన్ని ప్రకటించాయి. అమెరికా నిరుద్యోగం తగ్గినందుకు ఆశ్చర్యానందాలని ప్రకటించాయి. స్టాక్ మార్కెట్ల లాభాల్ని కూడా ఉపాధి నివేదికకి ఆపాదించి సంతృప్తి చెందాయి. అనుకోకుండా శుభవార్త విన్నామని శీర్షికలు పెట్టి మంచి రోజులు రానున్నాయని అమెరికా…

అమెరికా ఆర్ధిక వృద్ధి ఆశావాహంగా లేదు -ఐ.ఎం.ఎఫ్

అమెరికా ఆర్ధిక ‘రికవరీ’ ఏమంత ప్రోత్సాహకరంగా లేదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. 2012 సంవత్సరానికి అమెరికా జి.డి.పి వృద్ధి రేటు అంచనాని 2.1 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. యూరో జోన్ ఋణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోని అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత ప్రమాదకరంగా మార్చాయని తెలిపింది. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టే లోపు అప్పు పరిమితిని మరోసారి పెంచాల్సి ఉందని హెచ్చరించింది. 2012 సంవత్సరానికి గాను అమెరికా…

నిరుద్యోగంతో తల్లిదండ్రుల చెంత చేరుతున్న అమెరికా యువత -కార్టూన్లు

స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే అమెరికా యువత ఇప్పుడు తన తీరు మార్చుకుంటోంది. బలహీన ఆర్ధిక వ్యవస్ధ సృష్టించిన సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రుల తోడిదే లోకంగా సమాధానం చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల చెంతకు చేరడాన్ని వారేమీ సిగ్గుపడక, తల్లిదండ్రులతో సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అమెరికా యువకులు చెబుతున్నారని  “ప్యూ రీసెర్చ్ సెంటర్” జరిపిన సర్వే లో వెల్లడయింది. అమెరికా ఆర్ధిక మాంధ్యం…

Obama-Decorations

అధ్యక్షుడుగా ఒబామా సాధించేమిటి? -కార్టూన్

ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలు ముగించి అమెరికా సైనికుల్ని తిరిగి స్వదేశం రప్పిస్తానని గత అధ్యక్ష ఎన్నికల్లో వాగ్దానం చేసిన బారక్ ఒబామా మళ్ళీ ఎన్నికలు వస్తున్నా తన హామీ నిలుపుకోలేదు. పైగా పదవిని అధిష్టించినవెంటనే ఆఫ్ఘనిస్ధాన్ కి ‘ట్రూప్ సర్జ్’ పేరుతో మరో 30,000 సైనికుల్ని పంపించాడు. అధ్యక్ష ఎన్నికలు జరిగే 2012 చివరి నాటికి ఈ ముప్ఫై వేలమంది సైనికుల్ని ఉపసంహరిస్తున్నానని గత సంవత్సరం ప్రకటించాడు. అంటే, ఎన్నికల సంవత్సరంలో ‘సైనికుల ఉపసంహరణ’ పేరుతో తాను…