ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతోంది -ఐ.ఎం.ఎఫ్

2008 ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకుంటోందని భావిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతున్నదని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాల విధానాలు నమ్మకాన్ని పునరుద్ధరించడంలో విఫలం కావడంతో ప్రపంచ ఆర్ధిక వృద్ధి క్షీణ దశలోకి జారిపోయిందని ప్రపంచ ద్రవ్య సంస్ధ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఆర్ధిక వ్యవస్ధ మరింతగా క్షీణించే సూచనలు గణనీయంగా ఉన్నాయని కూడా ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. 2013 లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు 3.9 శాతం ఉంటుందని గత…

అమెరికా ఆర్ధిక వృద్ధి ఆశావాహంగా లేదు -ఐ.ఎం.ఎఫ్

అమెరికా ఆర్ధిక ‘రికవరీ’ ఏమంత ప్రోత్సాహకరంగా లేదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. 2012 సంవత్సరానికి అమెరికా జి.డి.పి వృద్ధి రేటు అంచనాని 2.1 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. యూరో జోన్ ఋణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోని అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత ప్రమాదకరంగా మార్చాయని తెలిపింది. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టే లోపు అప్పు పరిమితిని మరోసారి పెంచాల్సి ఉందని హెచ్చరించింది. 2012 సంవత్సరానికి గాను అమెరికా…

మూడో క్వార్టర్‌లో ఫర్వాలేదనిపించిన అమెరికా ఆర్ధిక వృద్ధి

మూడో క్వార్టర్ లో అమెరికా ఆర్ధిక వృద్ధి ఫర్వాలేదనిపించింది. గత రెండు క్వార్టర్లలో మాదిరిగానే అమెరికా జిడిపి వృద్ధి దాదాపు ఆగిపోయినట్లుగానె అందరూ భావిస్తున్న నేపధ్యంలో 2.5 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే సామాన్య జనం ఊపిరిలు ఆగిపోవడం కొనసాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా వాణిజ్య విభాగం గురువారం చేసిన ప్రకటనలో మూడవ క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు) జిడిపి వృద్ధి వివరాలు తెలిపింది. వార్షిక వృద్ధి…