ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు…

రష్యా సదస్సుకు ఈ‌యూ నేత, అమెరికా అభ్యంతరం!

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మధ్య లుకలుకలు మెల్లగానే అయినా పెరుగుతున్నాయి. రష్యా నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రతి యేటా జరిగే “సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం” (SPIEF) సమావేశాలకు ఈ యేడు యూరోపియన్ కమిషన్ (ఈ‌సి) అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ హాజరు కానున్నాడు. ఆయన రష్యా వెళ్లడానికి అమెరికా అభ్యంతరం చెబుతోంది. ఒక పక్క రష్యాపై అమెరికా-ఈ‌యూల ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతుండగా రష్యా జరిపే ఆర్ధిక సదస్సుకు ఈ‌సి…

ఇండియా ఫార్మా పరిశ్రమ: త్వరలో అమెరికా ఆంక్షలు?

జెనెరిక్ ఔషధ తయారీలో పేరెన్నిక గన్న భారత ఫార్మా పరిశ్రమపై వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎఫ్.డి.ఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఇటీవలే ఇండియా పర్యటించారు. ఆమె వివిధ ఔషధ ఎగుమతి కంపెనీల పరిశ్రమలను తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వాతావరణం మరింత వేడెక్కింది. ‘ప్రాధామ్య విదేశాలు’ (Priority Foreign Countries –…