క్లుప్తంగా… 09/06/2016

చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! మహిళలపై అమానుషాన్ని ఆపండి -ఐర్లండ్ తో ఐరాస ఉద్తా పంజాబ్ లో తప్పేముంది? -బొంబే హై కోర్ట్ రేపిస్టుని క్షమించి వదిలేయి, ప్లీజ్ చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బ్రిటన్ సెంట్రల్/రిజర్వ్ బ్యాంక్) మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్ చేసిన హెచ్చరిక! “భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ తమ విదేశీ ఆస్తులు అన్నీ అమెరికాపైనే ఆధారపడి ఉండటం చైనా తదితర…

అమెరికా: ఒక్క రోజులో 328 బిలియన్ల అప్పు

ఋణ పరిమితి పెంపుకు అంగీకరిస్తూ అమెరికా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందం చట్టంగా మార్చుతూ ఒబామా సంతకం చేసిన అనంతరం ఒక్క రోజులోనే అమెరికా 328 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. ఇది దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అనగా 2013-14 ఆర్ధిక సంవత్సరానికి మన వార్షిక బడ్జెట్ అయిన 16.65 లక్షల కోట్ల రూపాయల కంటే 3.35 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ. ఒబామా కేర్ పధకానికి నిధుల కేటాయింపు…

economic-bright-side

తీవ్ర స్ధాయిలో అమెరికా మాంద్యం -కార్టూన్

అమెరికా మాంద్యం (రిసెషన్) తీవ్రమవుతోందని ఆర్ధికవేత్తలు, రేటింగ్ సంస్ధలు హెచ్చరికలు తీవ్రం చేస్తున్నాయి. నిరుద్యోగం స్వల్పంగా తగ్గుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చూపుతున్నప్పటికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు వదులుకుని అనేకమంది దరఖాస్తు చేయడం మానేయడం వల్లనే నిరుద్యోగం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నదని వారు చెబుతున్నారు. పరిస్ధితి తీవ్రంగా ఉన్నప్పటికీ ఫెడరల్ బ్యాంక్ అధిపతి బెన్ బెర్నాంక్, ట్రెజరీ సెక్రటరి తిమోతి గీధనర్ లు ఆశావహంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. అమెరికాకి చెందిన ఈగాన్-జోన్స్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ మూడు రోజుల క్రితం…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -2

స్పెక్యులేటివ్ షేర్లను ఆధారం చేసుకుని అనేక షేర్ల కుంభకోణాలు జరిగాయి. భారత దేశంలో హర్షద్ మెహతా కుంభకోణం అతి పెద్దది. తర్వాత కేతన్ పరేఖ్ కుంభకోణం, ఆ తర్వాతా, ముందూ కూడా చిన్నా పెద్దా కుంభకోణాలు జరిగాయి. కొన్ని పత్రికలకెక్కితే, మరి కొన్నింటిని తొక్కిపెట్టారు. అమెరికా, యూరప్ లలో 2007-2009 కాలంలో మొదలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభమే ఒక పెద్ద కుంభకోణం. అనేక వందల స్పెక్యులేటివ్ కుంభకోణాల ఫలితమే “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” అనే బడా బడా…

అమెరికా అప్పు -కార్టూన్

అమెరికా 14.3 ట్రిలియన్ డాలర్లకంటే ఎక్కువ అప్పు చేయకూడదని పరిమితి ఉంది. మూడు దురాక్రమణ యుద్ధాల పుణ్యమాని అప్పు గరిష్ట పరిమితిని చేరుకుంది. అప్పులు చేసి ఆర్ధిక సంక్షోభంలో కుదేలైన బడా బడా వాల్ స్ట్రీట్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం బెయిలౌట్లు ఇచ్చింది. యుద్ధాలు మానేస్తే ఈ పరిస్ధితి వచ్చి ఉండకపోను. ఇప్పుడు అమెరికా తెచ్చిన కొన్ని అప్పులపై వడ్డీల చెల్లింపులకు, మరి కొన్ని అప్పుల పూర్తి చెల్లింపులకు గడువు ఆగష్టు 2 తేదీ గడువు. ఆ…

అమెరికా అప్పు రేటింగ్ తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేటింగ్ సంస్ధలు

ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న అమెరికా సావరిన్ అప్పు రేటింగ్‌ను తగ్గించడానికి ప్రపంచంలోని టాప్ రేటింగ్ సంస్ధలు మూడూ సిద్ధంగా ఉన్నాయి. స్టాండర్డ్ & పూర్స్ (ఎస్ & పి), ఫిచ్, మూడీస్ లు ప్రపంచ రేటింగ్ సంస్ధల్లో మొదటి మూడు సంస్ధలుగా పేరు పొందిన రేటింగ్ సంస్ధలు. ఇవి ఆయా దేశాల సావరిన్ అప్పు బాండ్లకు రేటింగ్ లు ఇస్తాయి. ఇంకా వివిధ ద్రవ్య సంస్ధలు, బ్యాంకులు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు తదితర…

అమెరికా, గ్రీసు దేశాలు సమయానికి అప్పు చెల్లించలేక పోవచ్చు -ఫిచ్ రేటింగ్స్

అమెరికా, గ్రీసు దేశాల అప్పు చెల్లింపుల సామర్ధ్యం పైన ఫిచ్ రేటింగ్స్ సంస్ధ మరొకసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు నెలలో రెండు దేశాలు తాము జారీ చేసిన సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ చెల్లింపులతో పాటు కొన్నింటికి మెచ్యూరిటీ చెల్లింపులు చేయవలసి ఉంది. అమెరికా అప్పుపై ఉన్న గరిష్ట పరిమితికి ఇప్పటికే చేరుకున్నందునా, గ్రీసు మరో విడత పొదుపు బడ్జెట్‌ను ప్రజల తీవ్ర వ్యతిరేకత వలన ఆమోదించలేక పోతున్నందున ఐ.ఎం.ఎఫ్, ఇ.యులు ఆ దేశానికి ఇవ్వవలసిన…

అమెరికా నిరుద్యోగం – బలహీన ఆర్ధిక వ్యవస్ధ – కొన్ని ముఖ్యాంశాలు

అమెరికా నిరుద్యోగం అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా మారింది. నిరుద్యోగం తగ్గడానికి నేరుగా చర్యలు తీసుకునే బదులు పెట్టుబడిదారులకు ప్రోత్సహాకాలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగం తగ్గించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకున్న ప్రవేటు బహుళజాతి సంస్ధలు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించే బదులు ద్రవ్య మార్కెట్లలో స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని చూస్తున్నారు. దానితో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాక ప్రజల కోనుగోలు శక్తి పెరగక ఉత్పత్తులు కొనేవాళ్ళు లేక ఆర్ధిక వ్యవస్ధ…

అప్పు పరిమితి పెంచకపోతే అమెరికా దివాళా ఖాయం -మూడీస్

రిపబ్లికన్, డెమొక్రట్ పార్టీలు అమెరికా అప్పు పరిమితి పెంచే విషయంలో త్వరగా ఒక ఒప్పందానికి రాకపోతే అమెరికా దివాళా ఖాయమని మూడీస్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. అమెరికా సావరిన్ అప్పు బాండ్లకు ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉందనీ, ఇరు పార్టీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలనీ లేకుంటే ఇపుడున్న టాప్ రేటింగ్ కోల్పోవాల్సి ఉంటుందనీ ఆ సంస్ధ హెచ్చరించింది. ప్రస్తుతం ట్రెజరీ బాండ్ల అమ్మకం ద్వారా అమెరికా ప్రభుత్వం సేకరించగల అప్పుపై 14.3 ట్రిలియన్ డాలర్ల మేరకు…

అమెరికా అప్పు ఎంతో తెలుసా?

ప్రపంచం లోని దేశాలన్నింటికంటే అమెరికాకి అప్పు ఎక్కువ ఉందని బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ అప్పు ఇంత అని అంకెల్లో చెప్పేయడం కంటే వివిధ కోణాల్లో వివిధ అంశాలతో పోల్చి చూస్తే దాని పరిణామం ఇంకా బాగా అర్ధం అయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1,000 డాలర్ల బిల్లుల్ని ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే అది 67 మైళ్ళ ఎత్తు ఉంటుందని అంచనా వేశాడు. అప్పట్లో అది ఫేమస్ పోలిక.…

అప్పు, లోటులతో దివాళా వాకిట అమెరికా ఆర్ధిక వ్యవస్ధ

ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా వాకిట నిలబడి ఉంది. 2007-08 సంవత్సరాల్లో తలెత్తిన సంక్షోభం లాగానే మరో అర్ధిక సంక్షోభం ముంగిట వణుకుతూ నిలుచుంది. మరో ఆర్ధిక మాంద్యం (రిసెషన్) నుండి తప్పించుకోవడానికి అమెరికా కాంగ్రెస్, సెనేట్లలో రిపబ్లికన్లు, డెమొక్రట్లు సిగపట్లు పడుతున్నారు. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికీ, అప్పు పరిమితిని పెంచుకోవడానికి ఓ అంగీకారానికి రావడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. అప్పు పరిమితి పెంపుపై ఒబామా హెచ్చరికలు, బడ్జెట్ లోటు తగ్గింపుపై…

అమెరికా అప్పు చెల్లింపు సామర్ధ్యంపై అనుమానాలు, అంచనా తగ్గించిన ఎస్ & పి

ప్రముఖ రేటింగ్ సంస్ధ అమెరికా అప్పు రేటింగ్ పై తన అంచనాను తగ్గించింది. ఇప్పటివరకు “స్ధిరం” గా ఉన్న అంచనాను “నెగటివ్” గా మార్చింది. దానర్ధం మరో రెండు సంవత్సరాల్లొ రేటింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని అర్ధం. అయితే ఆ లోపు పరిస్ధితి మారినట్లయితే అంచనాను మళ్ళీ “స్ధిరం” గా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తూ పొదుపు చర్యలతో కూడిన బడ్జెట్ కోత బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి.…

ధనికులకు పన్ను తగ్గింపు, పేదలకు సంక్షేమ పధకాల కోత; అమెరికాలో దారుణం

అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. దేశంలో ధనికుల వద్ద డబ్బు మూల్గుతుంటే పేదలు, మధ్య తరగతి ఆదాయాలు లేక ప్రభుత్వ సంక్షేమ పధకాల మీద ఆధారపడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో సంక్షోభ పరిష్కారానికి వెంటనే తట్టే ఆలోచన: ధనికులకు పన్ను పెంచి తద్వారా ఆదాయం పెంచుకోవడం. కాని అమెరికా ప్రతినిధుల సభకు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఐడియా తట్టింది. నిజానికి ఇది ఐడియా కాదు విధానం. అమెరికాలోని ప్రతినిధుల సభకు గత సంవత్సరం జరిగిన ఎన్నిల్లో…