అమెరికా ఆర్ధిక వృద్ధి అనుకున్నదానికంటే ఘోరం

అమెరికా ఆర్ధిక వృద్ధిలో తగ్గుదల అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండవ క్వార్టర్‌లో (ఏప్రిల్ నుండి జూన్ 2011 వరకు) అమెరికా ఆర్ధిక వ్యవస్ధ 1.3 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇది కూడా వార్షిక రేటు మాత్రమే. క్వార్టరులో చూస్తే 0.35 శాతమే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ రెండో క్వార్టర్ లో వృద్ధి చెందింది. ఇంకా ఘోరం ఏమిటంటే, మొదటి క్వార్టర్ లో (జనవరి నుండి మార్చి 2011 వరకు) అమెరికా…

అప్పు పరిమితి పెంపుపై ఒప్పందం శూన్యం, టాప్ క్రెడిట్ రేటింగ్ కోల్పోనున్న అమెరికా?

అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్లనుండి పెంచడానికి ఒబామాకి, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి మధ్య ఒప్పందం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆగస్టు 2 లోపు అప్పు పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకోనట్లయితే అమెరికా అప్పు చెల్లించలేని పరిస్ధితి వస్తుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇప్పటికె పలుమార్లు హెచ్చరించాడు. దీనితో అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ (క్రెడిట్ రేటింగ్) ను, మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధల్లో ఏదో ఒకటి…