50 కాదు 70 రోజులు ఆగాలి, మాట మార్చిన కేంద్రం

  “50 రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది” అని ప్రధాని మోడీ చెబుతూ వచ్చారు. మొన్న సుప్రీం కోర్టులో కూడా “మరో 15 రోజుల్లో కరెన్సీ పరిస్దితి పూర్తిగా మెరుగు పడుతుంది” అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీం ధర్మాసనానికి హామీ ఇచ్చారు. కానీ అదే రోహత్గి మరుసటి రోజే మాట మార్చేశారు.  “70 రోజుల వరకు ప్రజలు సహనం పాటించాలి. అసౌకర్యాన్ని భరించాలి. ఎందుకంటే 70 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం నల్ల ధనం, అవినీతిలపై…

దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి…