మోడి, అమిత్ జైత్రయాత్ర -కార్టూన్ కవిత

ఏయే శక్తులు చేతులు కలిపెనో… ఏయే సామ్రాజ్యాలు ఆశీర్వదించేనో… ఏయే వర్గాలు వైరుధ్యముల బాపెనో… ఏయే రాజకీయ వైరులు వెన్నుజూపెనో… ఏయే కంపెనీలు నిధులను పరిచెనో… ఏయే (హిందూ) దేవతలు ఓటు వర్షముల కురిపించెనో… ఏయే ముజఫర్ నగర్ లు ఆత్మహనన ఓట్లు గుమ్మరించెనో… ఏయే కుల సమీకరణలు తిరుగబడెనో… ఏయే పేలుళ్లు రక్త తిలకం దిద్దెనో… ఏయే మిత్రులు శత్రు నాటకంబాడెనో… ఏయే శత్రులు సలాము చేసెనో… నేర చట్టముల పదును విరిగెను! న్యాయ స్ధానములు…

(మత) ఆకర్షక రాజకీయాలు -ది హిందు ఎడిటోరియల్

ముంచుకొచ్చే ఎన్నికలు, ప్రభుత్వాల చర్యలకు అనివార్యంగా రంగు పులుముతాయి. ఉత్తర ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్ధానాలకు, ఒక పార్లమెంటరీ స్ధానానికి ఉప ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పై విద్వేష ప్రసంగం చేసినందుకు అభియోగ పత్రం నమోదు చేయడానికి తీసుకున్న నిర్ణయం రాజకీయ లక్ష్యంతోనే జరిగిందా అన్నది చర్చనీయమైన ప్రశ్న. అమిత్ షా పై దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు పోలీసులకు వెనక్కి…

ఎమ్మెల్యేకు బి.జె.పి వెల రు. 4 కోట్లు -ఎఎపి వీడియో

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అనైతికం ఏమీ లెదంటూ ప్రకటించిన బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా అంతరార్ధం ఏమిటో ఎఎపి పార్టీ వెల్లడి చేసింది. తమ ఎం.ఎల్.ఎ లు ఇద్దరినీ కొనుగోలు చేసేందుకు బి.జె.పి ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్ సింగ్ దాగర్ ఒక్కొక్కరికి 4 కోట్లు ఇవ్వజూపారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సాక్ష్యంగా వీడియోను కూడా ఎఎపి విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం గురించి విలేఖరులు అడిగిన…

(బి.జె.పి లో) తరాల మార్పులు -ది హిందు సంపాదకీయం

బి.జె.పిలో అత్యంత శక్తివంతమైన పార్లమెంటరీ బోర్డు నుండి త్రిమూర్తులు అతల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషిల నిష్క్రమణ, నూతనంగా సృష్టించిన సలహా కమిటీ మార్గదర్శక మండలిలోకి వారి తరలింపు… ఒక శకం ముగిసిందని సంకేతం ఇచ్చాయి. తన సైద్ధాంతిక నిలయానికే పార్టీ లంగరు తాళ్ళు కట్టివేయబడడం కొనసాగినప్పటికీ దాని పని విధానం మాత్రం -బి.జె.పి పరివర్తన వరకు జరిగిన పరిణామాలను బట్టి- అనివార్యంగా ప్రస్తుతం ఆ పార్టీని నియంత్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ప్రధాని…

మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్

కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తోడనే గుజరాత్ లో సంచలన కేసుల కధలు ఒక్కొక్కటీ కంచికి ప్రయాణం కడుతున్నాయి. ఆయా కేసుల్లో నిందితులకు గౌరవ మర్యాదలతో పదవులు దక్కుతున్నాయి. షోరాబుద్దీన్ షేక్ (మరియు) ఆయన భార్య  ఎన్ కౌంటర్, ఇష్రత్ జహాన్ (మరియు మరో ముగ్గురు ముస్లిం యువకులు) ఎన్ కౌంటర్, తులసీరాం ప్రజాపతి హత్య తదితర కేసుల్లో నిందితులైన ఐ.పి.ఎస్ అధికారులు ఇద్దరిని సగౌరవంగా తిరిగి పదవులు కట్టబెట్టారు. ఆషామాషీ పదవులు కాకుండా శక్తివంతమైన…

అమిత్ షా: కమల దళాలే ఆక్టోపస్ చేతులవ్వాలి -కార్టూన్

బి.జె.పి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన అమిత్ షా భారత దేశం కోసం తాను కంటున్న కలలేమిటో వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి అమిత్ షాకు అప్పగించడానికి బి.జె.పి కార్యర్గం లాంఛన ప్రాయంగా ఆమోద ముద్ర వేసిన అనంతరం ఆయన బి.జె.పి జాతీయ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్రసంగించారు. సదరు ప్రసంగంలో తన ఉద్దేశ్యాలేమిటో శాంపిల్ గా వివరించారాయన. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఐడియాలజీ ఒక్కటే దేశాన్ని శాసించిందని ఇక నుండి కాంగ్రెస్ ఐడియాలజీని పక్కకు నెట్టి కేవలం బి.జె.పి…

నన్ను పి.ఎంని చెయ్యి, నిన్ను అధ్యక్షుడ్ని చేస్తా -కార్టూన్

మనకిక్కడ ఒకప్పుడు ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఒకరి హఠాన్మరణం వలన ఆ రెండో పెద్దాయన కూడా హఠాత్తుగా ఒంటరి అయ్యారు. (తెలంగాణ ఆందోళన పుణ్యామని ఆ తర్వాత కూడా ఆయన కింగ్ మేకర్ గా కొనసాగారని కొన్ని పత్రికలు చెవులు కొరుకుతాయి.) గుజరాత్ లో కూడా ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఈ జంటకి ప్రమోషన్ వచ్చి రాష్ట్ర స్ధాయి నుండి కేంద్ర స్ధాయికి ఎగబాకింది. వారు…

అమిత్ షా: ఓడ అవుతున్న బండి!

‘ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును’ అని సామెత! బి.జె.పి జనరల్ సెక్రటరీ అమిత్ షా ఈ సామెతలో రెండో భాగాన్ని రుజువు చేసే క్రమంలో దూసుకుపోతూ ఉన్నారు. షోరాబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి బూటకపు ఎన్ కౌంటర్ కేసుల్లో జైలు పాలై ఒక దశలో ‘ఇక పోలిటికల్ కెరీర్ ముగిసినట్లే’ అని పలువురు చేత భావించబడిన అమిత్ షా మరికొద్ది రోజుల్లో బి.జె.పి అధ్యక్ష పదవిని అధిష్టించనున్నట్లు వార్తలు వస్తున్నాయంటే… నేటి వ్యవస్ధ ఏ శక్తులను నెత్తిన…

ఓటమి: ఎన్నికల ముందు కాంగ్రెస్, ఫలితాల ముందు బి.జె.పి

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేసిందని వివిధ పత్రికలు, ఛానెళ్లు తమ తమ విశ్లేషణల్లో పేర్కొన్నాయి. నరేంద్ర మోడి, అమిత్ షా లు చేసిన తాజా ప్రకటనలతో ఫలితాలకు ముందే బి.జె.పి తన ఓటమిని అంగీకరిస్తోందని ఇప్పుడు పత్రికలు, ఛానెళ్లు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రచారం మొదలయిందో లేదో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 7 రేస్ కోర్స్ రోడ్ నుండి కృష్ణ మీనన్ రోడ్ కు తన నివాసాన్ని మార్చేసుకున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్…

ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్: గుజరాత్ పోలీసు సాక్ష్యంలో మోడి పేరు

గుజరాత్ ముఖ్యమంత్రి, తమ తరపున భావి ప్రధానిగా బి.జె.పి నిలపనున్నదని పత్రికలు ఊహిస్తున్న నేత అయిన నరేంద్ర మోడి మెడపై మరో కత్తి వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇష్రత్ జహాన్, ఆమె స్నేహితుడు ప్రాణేశ్వర్ పిళ్లై అలియాస్ జావేద్ షేక్, మరో ఇద్దరు యువకుల బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఆయన పేరు వినిపిస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో, గుజరాత్ పోలీసులు కలిసి ఉమ్మడిగా చేసిన కుట్ర ఫలితంగా నలుగురు అమాయకులు బూటకపు ఎన్ కౌంటర్ లో చనిపోయారని…