ఆరు నెలల్లో అమరావతి పూర్తి కావాలి -హై కోర్టు

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఆంద్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాజధానిని ఎలా వీలుంటే అలా ఒక చోటి నుండి మరొక చోటికి మార్చే హాక్కు గాని, లేదా ప్రభుత్వ అంగాలను చిత్తం వచ్చిన రీతిలో ముక్కలు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని హై కోర్టు తీర్పు చెప్పింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు…

మూడు రాజధానుల బిల్లుల రద్దు, అమరావతి ఒక్కటే రాజధాని!

జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానికి బదులుగా కర్నూలు, విశాఖపట్నంలను కూడా కలిపి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఆంధ్ర ప్రదేశ్ కోర్టుకు సమాచారం ఇచ్చారు. వివాదాస్పదంగా మారి దేశ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాన…

అమరావతి రాజధానికి మద్దతుగా మహా పాదయాత్రలో బి‌జే‌పి!

ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మించడానికి బదులుగా మూడు రాజధానుల పేరుతో జగన్ నేతృత్వం లోని వై‌సి‌పి ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని ప్రముఖంగా ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతి బదులు విశాఖపట్నాన్ని వై‌సి‌పి ప్రకటించడంపై ఇంతవరకు పెద్దగా నోరు విప్పని బి‌జే‌పి ఇప్పుడు గత టి‌డి‌పి ప్రభుత్వ నిర్ణయం అమలుకై డిమాండ్ చేయటం విశేషం.  విజయవాడలో బి‌జే‌పి ఎస్‌సి మోర్చా సమావేశం సందర్భంగా నవంబర్ 21 తేదీన…