సింగూరు తీర్పు: అభావం అభావం చెందుతుంది -4

ఇపుడు మళ్ళీ వ్యవసాయ సమాజం, పారిశ్రామిక సమాజంగా పరిణామం చెందే విషయానికి వద్దాం. పశ్చిమ దేశాల్లో లేదా పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ సమాజం స్ధానంలోకి పరిశ్రమల సమాజం ఎలా వచ్చింది? ఉన్నట్లుండి హఠాత్తుగా వ్యవసాయం అదృశ్యం అయిపోయి పరిశ్రమలు వచ్చేశాయా? భూస్వాములు, ధనిక రైతులు హఠాత్తుగా పెట్టుబడిదారులుగా మారిపోయి, రైతులు-కూలీలేమో కార్మికులుగా మారిపోయారా? సమాధానం దొరకని సాధారణ తాత్విక ప్రశ్నలు కొన్ని మనకు అప్పుడప్పుడు ఎదురవుతు ఉంటాయి. కోడి ముందా, గుడ్డు ముందా?…