ఫాలక్, అఫ్రీన్… నేడు షిరీన్
మనుషుల్లో మృగత్వానికి అంతే లేకుండా పోతోంది. భర్త చేత విస్మరించబడి, మరో తోడు కోసం ఆశపడి వ్యభిచార కూపంలో చిక్కిన తల్లికి తనయగా పుట్టిన ఫాలక్, పురుషాధిక్య సమాజం క్రూరత్వానికి బలై రెండేళ్ల వయసులోనే కాటికి చేరి రెండు నెలలయింది. తండ్రికి అవసరం లేని ఆడపిల్లగా పుట్టి తండ్రి చేతుల్లో చిత్ర హింస అనుభవించిన మూడు నెలల అఫ్రీన్ మరణం ఇంకా మరుపులో జారిపోనేలేదు. మరో ఫాలక్, షిరీన్ పేరుతో ఇండోర్ ఆసుపత్రిలో చేరింది. షిరీన్ వయసు…