అమెరికా అప్పు చెల్లింపు సామర్ధ్యంపై అనుమానాలు, అంచనా తగ్గించిన ఎస్ & పి

ప్రముఖ రేటింగ్ సంస్ధ అమెరికా అప్పు రేటింగ్ పై తన అంచనాను తగ్గించింది. ఇప్పటివరకు “స్ధిరం” గా ఉన్న అంచనాను “నెగటివ్” గా మార్చింది. దానర్ధం మరో రెండు సంవత్సరాల్లొ రేటింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని అర్ధం. అయితే ఆ లోపు పరిస్ధితి మారినట్లయితే అంచనాను మళ్ళీ “స్ధిరం” గా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తూ పొదుపు చర్యలతో కూడిన బడ్జెట్ కోత బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి.…