ప్రభుత్వ లోక్‌పాల్ డ్రాఫ్టు దేశ ప్రజల పైకి విసిరిన ఓ పెద్ద జోక్ -ప్రధానికి లేఖలో హజారే

ప్రభుత్వ లోక్ పాల్ డ్రాఫ్టు చాలా బలహీనమైనదనీ, తప్పించుకోవడానికి అవసరమైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నదనీ కనుక తాము రూపొందించిన జన్ లోక్‌పాల్ డ్రాఫ్టును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం రూపిందించిన లోక్ పాల్ డ్రాఫ్టు భారత దేశ ప్రజల మీదికి విసిరిన ఒక పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రధానికి రాసిన లేఖలో అన్నా హజారే, ఆమరణ దీక్షకు దిగుతానన్న తన నిర్ణయాన్ని…

ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన అన్నా హజారే, మరోసారి ఆమరణ నిరాహార దీక్ష

కేంద్ర ప్రభుత్వ వైఖరితో అన్నా హజారే విసుగు చెందాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి ఏప్రిల్ లో ఆమరణ నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే, మరునాటి నుండే పౌర సమాజ కార్యకర్తలపై కేంద్ర మంత్రులు వివిధ ఆరోపణలతో దాడి ప్రారంభించడంతో ఖిన్నుడయ్యాడు. శాంతి భూషణ్, ఆయన కొడుకు ప్రశాంత్ భూషన్ ఇరువురూ కమిటీలో ఉండడం పట్ల మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు తర్వాత శాంతి భూషణ్ పై అవినీతి ఆరోపణను ఎక్కడో పాతాళం నుండి…

“రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరాహార దీక్షలో అన్నా హజారే

చెప్పినట్లుగానే అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభమయ్యింది. వేలమంది అనుచరులు, ఆసక్తిపరులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మద్దతుదారులతోహజారే తన ఒక రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగాశాంతియుత దీక్షకు దిగిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల చేత దాడిచేయించి, లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం జరిపించడానికి వ్యతిరేకంగాహజారే బుధవారం దీక్షను తలపెట్టారు. మొదట తన దీక్ష జంతర్ మంతర్ వద్దజరుగుతుందని అన్నా చెప్పినప్పటికీ ప్రభుత్వం అందుకు అనుమతి నిరాకరించడంతోతన శిబిరాన్ని…

పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ

ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు. కనీసం నిరసన…

లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే

కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించింది -అన్నా హజారే

భారత దేశంలోని ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్ దేవ్ జూన్ 4 తారీఖునుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారత దేశ రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు రహస్యంగా దాచుకున్న నల్ల ధనాన్ని భారత దేశానికి తిరిగి తెప్పించాలని ఆయన ప్రధాన డిమాండు. బాబా రామ్ దేవ్ తన దీక్షను ప్రారంభించడానికి బుధవారం ఢిల్లీకి ప్రయాణం కట్టగా ప్రధాని మన్మోహన్ సింగ్ దీక్ష ఆలోచనని విరమించుకోవాలని స్వయంగా రామ్ దేవ్‌కి విజ్ఞప్తి చేశాడు.…

ప్రధాని మంచోడే, రిమోట్ కంట్రోల్ తోనే సమస్య -అన్నా హజారే

భారత రాజకీయ నాయకులు , బ్యూరోక్రట్ల అవినీతిని అంతం చేయడానికే కంకణం కట్టాడని భావిస్తున్న అన్నా హజారే తాజాగా సోనియా గాంధీని తన విమర్శలకు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బెంగుళూరులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ రిమోట్ కంట్రోలు వల్ల సమస్యలు వస్తున్నాయని సంచలన ప్రకటన చేశాడు. “ప్రధాన మంత్రి మంచి వ్యక్తి. ప్రధాన మంత్రి చెడ్డవాడు కాడు. రిమోట్ కంట్రోలు కారణంగా సమస్యలు వస్తున్నాయి” అని…

అవినీతిపై పోరాటం ఇంత సులువా?

అన్నా హజారే! ఇప్పుడు చాలామంది భారతీయుల నోట నానుతున్న పేరు. నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాడని భావిస్తున్న బ్రహ్మచారి. గాంధేయుడయిన హజారే, గాంధీ బోధించిన అహింసా సిద్ధాంత పద్ధతిలో పోరాటం చేసి రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ల అవినీతి అంతానికి నడుం బిగించాడని దేశవ్యాపితంగా ప్రశంసలు పొందుతున్నాడు. ఉన్నత స్ధానాల్లోని వ్యక్తులు -మంత్రులు, బ్యూరోక్రట్ అధికారులు- విచ్చలవిడిగా అవినీతికి పాల్పడికూడా ఎట్టి విచారణ లేకుండా తప్పించుకుంటున్నారనీ, అటువంటి వారిని విచారించే అత్యున్నత…