హజారే కోసం తీహార్ జైలు వద్ద మద్దతుదారుల ఎదురుచూపు -ఫొటోలు

ప్రత్యేక మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అన్నా హజారేతో పాటు కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతిభూషణ్ తదిరతరులను తీహార్ జైలుకి తీసుకెళ్ళిన కొన్ని గంటలకే ప్రభుత్వం వారి విడుదలకు ఆదేశాలిచ్చింది. ఇతర నాయకులు బైటికి వచ్చినప్పటికీ అన్నా హజారె బైటికి రావడానికి తిరస్కరించాడు. తన దీక్షకు బేషరతు అనుమతి ఇచ్చేవరకూ బైటికి వచ్చేది లేదని ప్రభుత్వానికి తెగేసి చెప్పాడు. దానితో ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మంగళవారం రాత్రినుండీ హజారే మద్దతుదారులు తీహార్ జైలు గేటు…

హజారే అరెస్టుపై రెండు వారాల్లో నివేదిక కావాలి -జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్

భారత దేశ ప్రజల మానవ హక్కులను కాపాడవలసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఓ విషాధకరమైన జోక్ పేల్చింది. శక్తివంతమైన లోక్ పాల్ బిల్లు కోసం శాంతియుతంగా అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారేతో పాటు ఆయన మద్దతుదారులను అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా మానవహక్కుల కార్యకర్త ఒకరు పిటిషన్ దాఖలు చేయడంతో దానికి స్పందించింది. అన్నా హజారే, అతని మద్దతుదారుల అరెస్టుపై రెండు వారాల్లొగా నివేదిక సమర్పించాలని హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కమిషన్ కోరింది.…

అన్నా హజారే అరెస్టుపై దేశ వ్యాపిత స్పందన -ఫోటోలు

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలనీ, లోక్ పాల్ పరిధిలోనికి ప్రధాని, ఛీఫ్ జస్టిస్ లను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పౌర సమాజ కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టడంతో పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. బెయిల్ కోసం పోలీసులు విధించిన షరతులను నిరాకరించడంతో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషణ్, కిరణ్ బేడీ లను కోర్టు ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ పరిణామాల క్రమంలొ దేశవ్యాపితంగా…

హజారేతో పాటు నలుగురికి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, తీహార్ జైల్లో ఉంచే అవకాశం

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నా హజారే, ఆయన బృందంలోని సభ్యులైన కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషన్ లకు ప్రత్యేక మెజిస్టీరియల్ కోర్టు ఏడు రోజుల పాటు జ్యుడిషయల్ కస్టడీ విధించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జయప్రకాష్ నారాయణ పార్కులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నా హజారే ప్రకటించడంతో ఆయనని అరెస్టు చేశామని ఢిల్లీ పొలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నా హజారే వ్యక్తిగత బాండు సమర్పించడం ద్వారా బెయిల్ పొందవచ్చునని కోర్టు షరతు…

అన్నా హజారే అరెస్టు, నిర్బంధంలోనే నిరవధిక నిరహార దీక్ష ప్రారంభం

అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. అవినీతిపై తన పద్ధతిలో సమర శంఖం పూరించిన అన్నా హజారేను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించకముందే అరెస్టు చేశారు. 74 ఏళ్ళ అన్నా హజారేను 7:30 గంటలకే ఆయన ఉంటున్న  తూర్పు ఢిల్లీలోని అపార్ట్‌మెంటుకి వెళ్ళి అరెస్టు చేశారు. మొదట దీక్ష విరమించాలని నచ్చజెప్పిన పోలీసు అధికారులు, అందుకాయన ససేమిరా అనడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వేలమంది మద్దతుదారులతో దీక్షకు కూర్చుంటున్నానని హజారే చెప్పినందున ముందస్తు జాగ్రత్తగా…