పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం

బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన…

ముంబై తో పాటు ఢిల్లీ కూడా విస్మరించిన ‘అన్నా పిలుపు’

‘పటిష్టమైన లోక్ పాల్ బిల్లు’ తేవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్నా ఇచ్చిన ఆందోళన పిలుపును ఈసారి ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. గతంతో పోలిస్తే ప్రజలు ఆన్నా ఆందోళనకు అంత తీవ్రంగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందాక తమ ఆందోళన ఎన్నికల సంస్కరణలపై కేంద్రీకరిస్తుందని ప్రకటించిన అన్నా బృందం, అప్పటికి ఎంతమంది ప్రజలను ఆకర్షించగలుగుతారన్నదీ ఇపుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వం తలపెట్టిన ‘బలహీన’ లోక్ పాల్ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన జరపాలని…

అన్నా బృందం నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు -స్వామి అగ్నివేష్

అన్నా బృందంతో కలిసి కొంతకాలం పాటు నడిచిన స్వామి అగ్నివేష్, ఆ బృందం సభ్యులు కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని శుక్రవారం ఆరోపించాడు. తమ బృందం నుండి అగ్నివేష్‌ను తప్పించిన ‘టీమ్ అన్నా’ దీక్ష ముగిశాక అగ్నివేష్ మాట్లాడినదని చెబుతూ ఒక సి.డిని విడుదల చేశారు. అవతలి వ్యక్తితో అన్నా బృందానికి అంతకాలం అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదని చెబుతున్న ఈ సిడిలో కొంతభాగం మార్చారని ఆరోపించాడు. అగ్నివేశ్ ‘కపిల్‌జీ’ అని సంబోధించడాన్ని బట్టి అవతలి వ్యక్తిని…

నేను అన్నాను కాను, పదేళ్ళనుండి దీక్షలో ఉన్న “ఇరోమ్ షర్మిలా”ను

ప్రభుత్వం అన్నా హజారే ఆరోగ్యం కోసం తపన పడుతోంది. కనీసం తపన పడుతున్నట్లు నటిస్తోంది. అన్నా హజారే ప్రాణాలు చాలా విలువైనవనీ, అవి దేశానికి చాలా అవసరమనీ, ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమనీ కనుక ఆయన వెంటనే తన నిరాహార దీక్షను ఉపసంహరించుకోవాలని గురువారం పార్లమెంటులో ప్రధాని విజ్ఞప్తి చేశాడు. బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశం కూడా అన్నా హజారే దీక్ష విరమించాలని కోరింది. గురువారం లోక్ సభ లో ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకురాలు…

అన్నా దీక్ష చేసుకోదలిస్తే చేసుకోనివ్వండి, అది మా సమస్య కాదు -ప్రణబ్, ఖుర్షీద్

ఓ వైపు ప్రధాని మన్మోహన్ అన్నా హజారే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతున్నదని చెబుతుండగా మరో వైపు ప్రధాని సహచరులు అన్నా దీక్ష తమ సమస్య కాదు పొమ్మంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఒప్పందం కుదురుతుందన్న వార్తాలు షికార్లు చేయగా సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చలు వాడిగా జరిగినట్లుగా పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నదాన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రభుత్వానికీ అన్నా బృందానికి మధ్య జరుగుతున్న చర్చలు మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్ధితి కనపడుతోంది. మంత్రులు ప్రణబ్…

అన్నా దీక్ష విరమణకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం?

అన్నా బృందానికీ, ప్రభుత్వానికి మద్య విభేధాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్న ఊహాగానాలు ఆదివారం వెలువడ్డాయి. మాహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ఆదివారం అన్నాను కలవడంతో ఈ ఊహాగానాలు బయలుదేరాయి. అన్నా హజారే మహారాష్ట్ర వాసి కావడం ఈ సందర్భంగా గమనార్హం. సదరు అధికారి, అన్నాల మధ్య జరిగిన చర్చలను “వ్యక్తిగతమైనవి”గా అన్నా బృందం అభివర్ణించడం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. ఐతే ప్రధానిని, ఉన్నత న్యాయ వ్యవస్ధను లోక్ పాల్…