అన్నా హజారే దృష్టిలో ‘గొడ్రాలు’ చులకన!

రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే, పిల్లలు కలగని స్త్రీలపైన తన అవగాహనా రాహిత్యాన్నీ, చిన్నచూపును చాటుకున్నాడు. తన జీవితంలో అత్యధిక భాగం గ్రామంలో నివసించే అన్నా, గ్రామీణ భారతంలో ఉన్న వెనకబాటు భావనలకు తాను అతీతుడిని కానని మంగళవారం దీక్షలో ప్రసంగిస్తున్న సందర్భంగా వెల్లడించుకున్నాడు. ప్రసంగం సందర్భంగా అన్నా హజారే “బంఝ్ క్యా జానె ప్రసూతి వేదనా (గొడ్రాలికేం తెలుసు ప్రసవ వేదన)?” అని వ్యాఖ్యానించినట్లుగా హిందూస్ధాన్ టైమ్స్ వెల్లడించింది.…