నూతన ఆర్ధిక విధానాలపై పోరాడని అవినీతి వ్యతిరేక పోరాటాలు వృధా

(గతంలో రెండు భాగాలుగా ఈ వ్యాసం రాయబడింది. ఆ వ్యాసంలో అనవసరమైన భాగాలు తొలగించి, మరిన్ని వివరాలు జోడించి, మరింత పరిపూర్ణత కావించి తిరిగి ప్రచురించడం జరుగుతోంది) అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారులఅవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా పోరాడుతున్నాడని పత్రికలు కోడై కూస్తునాయి. ఈ మధ్య కాలంలో ఈ కూతల సంఖ్య తగ్గినా అన్నా హజారే కి అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు బిరుదు ఇవ్వడం మానలేదు. పఠిష్టమైన లోక్…