‘పాకిస్ధాన్ నరకం కాదు’ అన్నా దేశద్రోహమేనా?

  “అసహనం ఎక్కడుంది?” అని ప్రశ్నిస్తూ  ఢిల్లీలో ఊరేగింపు నిర్వహించిన హాలీ వుడ్ నటుడు ‘అనుపమ్ ఖేర్’ ఓ సారి కర్ణాటక వఛ్చి చూడాలి. హిందుత్వ మూకలు ఏమి చేసినా అది దేశ భక్తే అనో లేదా సహన సహితమే అనో ఆయన తేల్చిపారేస్తే తప్ప, ‘అసహనం’ రుచి ఏమిటో ఆయనకు తెలుస్తుంది.  “పాకిస్తాన్ నరకం ఏమి కాదు. అది ప్రజలు నివసించే దేశం” అని రాజకీయవేత్తగా మారిన ఒక సినిమా నటి ప్రకటించారు. “పాకిస్ధాన్ అంటే…

అనుపమ్ ఖేర్ తిక్క లాజిక్!

అనుపమ్ ఖేర్ తో సహా హిందూత్వ (హిందూ మతావలంబకులు కాదు) గణాలు చెబుతున్న మాట, అమీర్ ఖాన్ దేశాన్ని అవమానించాడని. తన (భార్య) వ్యాఖ్యల ద్వారా అమీర్ కుటుంబం దేశం పరువు తీశారని, సిగ్గుపడేలా చేశారని విమర్శించారు. విచిత్రం ఏమిటంటే ఒక పక్క అమీర్ ఖాన్ భార్య అన్న మాటల్ని తప్పు పడుతూనే మరో పక్క ఆ మాటలు ఖండించే హక్కు మాకూ ఉందని వాదనలు చేయడం. ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. అమీర్ ఖాన్ భార్య…

అమీర్ ఖాన్: ఛీత్కారాలు, అభినందనలు!

సినిమాల్లో విజయవంతమైన కెరీర్ తో సరిపెట్టుకోకుండా, ‘సత్యమేవ జయతే’ పేరుతో టి.విలో కార్యక్రమం నిర్వహించడం ద్వారా అనేకమంది భారతీయుల మన్ననలు అందుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ‘పరమత సహనం/అసహనం’ పై దేశంలో చెలరేగిన రాజకీయ మరియు అరాచకీయ దుమారం  నుండి దూరంగా నిలబడి తప్పించుకోవడానికి బదులు అటో, ఇటో ఒక మాట విసిరి తానూ ఉన్నానని నిరూపించుకునే సెలబ్రిటీలు చాలా తక్కువమందే. ఒకవేళ ఎవరన్నా ముందుకు వచ్చినా కర్ర విరగ…