అమెరికా ఇక ప్రపంచ పోలీసు కాజాలదు -ట్రంప్

  తదుపరి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య మొదటి చర్చ అమెరికాలో ప్రారంభం అయింది. అమెరికా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగబోయే లోపు అధ్యక్ష పదవికి పోటీ లో ఉన్న అభ్యర్థులు బహిరంగ చర్చ (డిబేట్) లో మూడు సార్లు పాల్గొనవలసి ఉంటుంది.   ఈ చర్చలలో అభ్యర్థులు తమ ఆర్ధిక, రాజకీయ, విదేశాంగ విధానాలతో పాటు దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తాము ఎలా పరిష్కరిస్తామో…

డొనాల్డ్ ట్రంప్: ప్రపంచీకరణని తిరగదోడతాడా?

నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక వింత పరిస్థితిని ప్రపంచ ప్రజల ముందు ఉంచుతున్నాయి. రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు తమ సాంప్రదాయ రాజకీయార్ధిక, సామాజికార్ధిక ప్రాధామ్యాలను పక్కనబెట్టి ప్రత్యర్ధి ప్రాధామ్యాలను సొంతం చేసుకోవడమే ఆ వింత పరిస్ధితి! సాధారణంగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ రాజకీయంగా, సామాజికంగా కన్సర్వేటివ్ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్థికంగా ధనిక వర్గాలకు, కంపెనీలకు, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తుంది. డెమొక్రటిక్…

హిల్లరీ: ఆమె గాజు పైకప్పు బద్దలు కొట్టారట!

అమెరికా డెమోక్రటిక్ పార్టీ జరిపిన సదస్సులో హిల్లరీ రోధమ్ క్లింటన్ అధ్యక్ష పదవి అభ్యర్థిగా అధికారికంగా నామినేషన్ పొందారు. ఆమె నామినేషన్ ను అమెరికా పత్రికలు, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా వచ్చే మీడియా “చరిత్ర సృష్టి” గా ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తరచుగా కీర్తించుకునే అమెరికాలో అభ్యర్థి పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందిన మొట్టమొదటి మహిళ హిల్లరీ క్లింటన్ కావడమే వారి ఉబ్బితబ్బిబ్బులకు కారణం. అమెరికాకు స్వతంత్రం వచ్చి 240 యేళ్ళు…