$800 కి ఒప్పుకుని $30 ఇచ్చి దొరికిపోయిన ఒబామా భద్రతాధికారులు

ఒక రాత్రికి 800 డాలర్లు ఇస్తామని ఒప్పుకున్న అమెరికా భద్రతాధికారులు సేవ ముగిశాక 30 డాలర్లు మాత్రమే ఇచ్చి మోసం చేయడంతో పోలీసులకి పట్టుబడ్డారని బి.బి.సి తెలిపింది. కొలంబియా లో జరిగిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) కాన్ఫరెన్స్ కి హాజరయిన బారక్ ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వ్యభిచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఒప్పుకున్న మొత్తాన్ని చెల్లించకుండా ఒబామా భద్రతాధికారి మోసం చేయబోవడంతో మహిళ ఆగ్రహం…