ఐఫోన్ X: తయారీ ఖర్చు $358, అమ్మకం ధర $1570 -విశ్లేషణ

మాకింతోష్ (మ్యాక్) కంప్యూటర్, ఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్… ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఎంత గిరాకీ అంటే ప్రపంచంలో అనేక దేశాల జి‌డి‌పి విలువల కంటే ఎక్కువగా యాపిల్ కంపెనీ వద్ద డబ్బు పోగుబడేటంత! ఐ ఫోన్ ను సొంతం చేసుకోవడం కోసం రెండేళ్ల క్రితం చైనా యువకుడు ఒకరు తన కిడ్నీని అమ్ముకున్నాడంటే యాపిల్ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. భారీ మొత్తంలో…

సూటు, బూటు బడాబాబు దర్జాల మర్మమేమి? -కార్టూన్

(కార్టూనిస్టు: ఎనెకో లాస్ హెరాస్. వెనిజులా రాజధాని కారకాస్ లో పుట్టిన ఎనెకో ఇప్పుడు స్పెయిన్ లో నివసిస్తున్నారు. ఆయన కార్టూన్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.) వ్యవస్ధని మోస్తున్నదెవరు? కష్టపడి వ్యవస్ధని నడిపేది మేమే అని బానిస వ్యవస్ధల కాలంలో బానిసల యజమానులు అన్నారు. ఫ్యూడల్ ప్రభువుల కాలంలో రాజులు, మంత్రులు, సైన్యాధిపతులు, భూస్వాములు, జమీందార్లు… ఇత్యాదిగా గల ప్రభు వర్గాలు తాము లేకపోతే సామాజిక వ్యవస్ధ ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. పండితులు ‘ఔను కదా!’…