అణు శక్తి లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీరతాయి -అధ్యయనం

అణు విద్యుత్ తో పని లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. బెంగుళూరులోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐ.ఐ.ఎస్.సి) కి చెందిన ప్రొఫెసర్లు తయారు చేసిన అధ్యయన నివేదిక ఈ సంగతి ప్రకటించింది. సౌర విద్యుత్తుతో పాటు ఇతర సాంప్రదేయేతర విద్యుత్ వనరుల ద్వారా భారత దేశం యొక్క పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని ‘కరెంట్ సైన్స్’ అనే పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అణు విద్యుత్…

కూడంకుళం ఆందోళన: సముద్ర అలలపై కొత్తతరహా ఉద్యమం

కూడంకుళం అణు కర్మాగారంకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్ధానిక ప్రజలు తమ పోరాటానికి సముద్రాన్ని తోడు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు తమ ఊళ్లను, రహదారులను, ఖాళీ స్ధలాలను పోలీసు మాయం చేసిన నేపధ్యంలో గురువారం సముద్రంలోకి దిగి ఆందోళన మొదలు పెట్టారు. మధ్య ప్రదేశ్ ‘జల్ సత్యాగ్రహ్’ తరహాలో సముద్రంలోకి దిగి మానవహారాన్ని నిర్మించి రోజంతా ఆందోళన తెలిపారు. ప్రభుత్వం యధావిధిగా పోలీసుల చేత సముద్రం ఒడ్డుని దిగ్భంధించింది. అదనపు పోలీసు బలగాలను రప్పించి ప్రజలపై వేధింపులు కొనసాగించింది.…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలపై కూడంకుళం ప్రజల వీరోచిత పోరాటం

పర్యావరణంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతీసే ‘కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు’ (కె.ఎన్.పి.పి) కి వ్యతిరేకంగా కూడంకుళం ప్రజల పోరాటం కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అణచివేత, దుష్ప్రచారం, పోలీసు నిర్బంధాలకు ఎదురోడ్డి సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉద్యమ నాయకులు ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులను పోలీసులు పట్టుకెళ్లకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవడానికి అరెస్టు అవుతానని ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులు ప్రకటించినప్పటికీ…

అణు విద్యుత్తుని పక్కకు నెట్టి, సోలార్ విద్యుత్ తో రికార్డులు సృష్టిస్తున్న జర్మనీ

ఆధునిక శాస్త్ర సాంకేతిక ఉత్పత్తులలో పేరెన్నిక గన్న జర్మనీ, దేశానికి అవసరమైన విద్యుత్తులో మూడు వంతులు సూర్య శక్తి నుండే ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. మరో పదేళ్ళలో అణు విద్యుత్ ను పూర్తిగా త్యజించడానికి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకున్న జర్మనీ, అణు విద్యుత్తు కంటే శుభ్రమైన ఇంధనం లేదన్న కంపెనీల ప్రచారాన్ని తిప్పికొడుతూ సూర్య శక్తి వినియోగంలో ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. 20 న్యూక్లియర్ పవర్ స్టేషన్ల సామర్ధ్యానికి సమానంగా గంటకు 22 గిగావాట్ల విద్యుత్…

కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు

రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…

కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం

తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి…

అణు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిషేధించటానికి జర్మనీ నిర్ణయం

అణు విద్యుత్ కర్మాగారాలకు సంబంధించి జర్మనీ ప్రభుత్వం సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. 2022 కల్లా అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న అణు కర్మాగారాలను దశలవారిగా మూసి వేస్తూ, 2022కల్లా అణు విద్యుత్ అనేదే దేశంలో లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. జపాన్‌లో మార్చిలో సంభవించిన భూకంపం, సునామీల వలన 30,000 మంది చనిపోవడమో, ఆచూకీ గల్లంతవడమో జరిగింది. దాంతో పాటు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం భూకంపం, సునామీల ధాటికి బాగా…

పెట్రోలు దాహంలో చైనాతో పోటీ పడుతున్న ఇండియా

అమెరికాతో  పెట్రోలు వనరుల కోసం చైనా పోటిపడడం ఇప్పటివరకూ తెలుసు. తాజాగా ఇండియా చైనాతో పోటీ పడుతున్న పరిస్ధితి నెమ్మదిగానే అయినా స్ధిరంగా తలెత్తుతోంది. అమెరికా దురాక్రమణ యుద్ధాలు చేస్తూ పెట్రోలు కోసం తెగబడుతుంటే, చైనా వాణిజ్య ఒప్పందాల ద్వారా, పెట్టుబడుల ద్వారా పోటీ పడుతోంది. ఇప్పుడు చైనా పద్ధతుల్లోనే ఇండియా కూడా ఆయిల్, గ్యాస్ వనరుల కోసం పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. తాజాగా కజకిస్ధాన్ ఆధీనంలోని పెట్రోల్ బావిలో భారత ప్రభుత్వం సంస్ధ ఓ.ఎన్.జి.సి…