ఒబామా మోడీల అణు కౌగిలి -కార్టూన్

రిపబ్లిక్ డే రోజున భారత సంబరాలకు అతిధిగా హాజరయిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆ ముందు రోజున భారత ప్రధాని మోడితో మంతనాలు జరిపారు. మంతనాల అనంతరం 2008లో కుదుర్చుకున్న ‘పౌర అణు ఒప్పందాన్ని’ ఆపరేషనలైజ్ చేసేందుకు తాము ఒక అంగీకారానికి వచ్చామని ఇరువురు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే ఆ ఒప్పందంలోని అంశాలు ఏమిటో ఇంతవరకు జనానికి చెప్పలేదు. అమెరికా అధికారులకు తెలిసిన ఒప్పందం వివరాలు భారత ప్రజలకు ఎందుకు తెలియకూడదు? భారత ప్రజలకు చెప్పకూడని…